ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి
* మిర్యాలగూడ వైర స్థానాలు కేటాయించాల్సిందే
* విలేకరుల సమావేశంలో జూలకంటి
మిర్యాలగూడ ప్రజాలహరి….
దేశంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని ఓడించాలని లక్ష్యంతో ఇండియా కూటమి పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని మాజీ ఎమ్మెల్యే జూలక రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నవంబర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గాను కాంగ్రెస్ సిపిఎం పార్టీలు రాజకీయ అవగాహన కుదుర్చుకున్నాయని అందులో భాగంగా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే సీట్లు సర్దుబాటు చేసుకోవాలన్నారు. 119 స్థానాల్లో ఇరు వామపక్షాలు పది స్థానాలను కోరగా అందులో నాలుగు స్థానాలు కేటాయిస్తామని ఒప్పందం కుదిరిందని తెలిపారు. మిగిలిన 115 స్థానాలు వామపక్షాలు సంపూర్ణంగా కాంగ్రెస్కు మద్దతు తెలుపుతాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం కు మిర్యాలగూడ వైరా స్థానాలను తప్పనిసరిగా కేటాయించాలని సూచించారు వామపక్షాలకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పూర్తిగా మద్దతు తెలపాలన్నారు. రెబల్గా పోటీ చేయకుండా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయంగా బిఆర్ఎస్ ను గద్దే దించేందుకు కాంగ్రెస్ నాయకులు కలిసి రావాలన్నారు. మేము అడిగిన సీటు తప్పనిసరిగా ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేయాలని సూచించారు. గత ఎన్నికల్లో తక్కువ ఓట్లతో కాంగ్రెస్ అనేక స్థానాలు కోల్పోయిందని ఆ విషయాన్ని గుర్తుంచుకొని వామపక్షలకు సంపూర్ణంగా మద్దతు తెలపాలని కోరారు. అప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాలు వీడి రాజకీయ విధానాల ప్రయోజనం కోసం పార్టీలు పని చేయాలన్నారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ త్వరితగతంగా తేల్చాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు గిరిజన సంఘ రాష్ట్ర నాయకులు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, వరలక్ష్మి, పరశురాములు, వినోద్ నాయక్, శశిధర్ రెడ్డి, రొండి శ్రీనివాస్, రాంచంద్రు, దేశిరం నాయక్, పాల్వాయి రాంరెడ్డి, గోవింద్ రెడ్డి, ఏసు, వెనుధర్ రెడ్డి, పిల్లుట్ల సైదులు, సైదులు తదితరులు పాల్గొన్నారు.