- ఐకెపి కొనుగోలు కేంద్రం ప్రారంభం
వేములపల్లి అక్టోబర్ ప్రజాలహరి….. రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యాన్ని తరలించి మద్దతు ధర పొందవచ్చని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రామలింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని ఆమనగల్లు గ్రామంలో ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో 17% కంటే తేమశాతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే సమయంలో రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్, పట్టేదారి పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను తీసుకువచ్చి కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సమర్పించాలన్నారు. నాణ్యమైన వరి ధాన్యం ఏ గ్రేడ్ 2203, సాధారణ రకానికిరూ 2183 మద్దతు ధర పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపిఎం అనూక్, సీసీ రమణయ్య, జిల్లా సమైక్య అధ్యక్షురాలు కొంచెం నాగమణి, బుక్ కీపర్ దివ్య, సభ్యులు లూర్దమ్మ, సైదమ్మ, జానమ్మ, శ్రీలత,రైతులుతదితరులు పాల్గొన్నారు.