Ultimate magazine theme for WordPress.

భాస్కర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరికలు

Post top

దామరచర్ల ప్రజాలహరి…..దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బిజెపి పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు.పట్టణంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  బిఆర్ఎస్ లో చేరిన వారికి గులాబీ కండువాలు వేసి స్వాగతించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు  మాట్లాడుతూ. సీఎం కేసిఆర్ నాయకత్వాన్ని బలపరిచేవిధంగా యువత బిఆర్ఎస్ లో చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, బిఆర్ఎస్ నాయకులు కొడాలి ప్రభాకర్ రావు, పరంగి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.