హాలియాలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గిరిజన ఆత్మగౌరవ సభ,
ప్రజాలహరి హలియా…..
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జులు ఎమ్మెల్సీ ఎమ్. సి కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ కోపరేటివ్ చైర్మన్ వాల్య నాయక్, రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్, ఎస్టీ కార్పొరేషన్ మెంబర్ రాంబాబు నాయక్ గార్లతో పాటు ఇతర గిరిజన ప్రజాప్రతినిధులు హాజరైనారు.
హాలియాలో దేవరకొండ రోడ్డు నుంచి సభా ప్రాంగణం వరకు గిరిజన ర్యాలీ జనసంద్రమైన హాలియా
*మంత్రి స్పీచ్ లో హైలెట్స్*
దేశంలో కాంగ్రెస్ పార్టీకి అతి గతి లేదు100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు కావడం ఆ పార్టీ దౌర్భాగ్యం.
కాంగ్రెస్ పార్టీకి దేశంలో గ్యారంటీ లేదు ఆ పార్టీ నాయకులకు ఇచ్చే హామీలకు గ్యారెంటీ ఉండదు
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు 2021 శాసనసభ ఎన్నికల్లోనే జానారెడ్డిని ఈ ప్రాంత ప్రజలు ఓడించారు. రేపు శాసనసభ ఎన్నికల్లో ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జై వీర్ రెడ్డిని ఓడించడం బీఆర్ఎస్ పార్టీకి ఈ నియోజకవర్గ ప్రజలకు పెద్ద లెక్క ఏమీ కాదు.
ఉమ్మడి రాష్ట్రంలో జానారెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గ ప్రజలకు కనీసం తాగేందుకు మంచినీరు కూడా ఇవ్వకపోవడం బాధాకరం
రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొని గులాబీ పార్టీకి ప్రచారం చేస్తానని శాసనసభలో మాట్లాడిన జానారెడ్డి ఇవాళ మాటతప్పిండు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పలేదు ఆ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తుండు
వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు దేశంలో 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం
ఈ ఎన్నికలలో ప్రజలను మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విశ్వయత్నంచేస్తున్నారు
కర్ణాటక రాష్ట్రంలో 600 రూపాయలు పింఛన్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 3000 ఇస్తానని చెప్పడం హాస్యాస్పదం
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అవకాశం అధికారంలోకి వచ్చిన తర్వాత సౌభాగ్య లక్ష్మి కింద మహిళలకు నెలకు 3000 రూపాయలు, రైతుబంధు పథకం కింద దశలవారీగా 16 వేల రూపాయలను రైతులకు అందజేయడంతో పాటు రేషన్ షాపుల ద్వారా ఇంటింటికీ సన్న బియ్యం ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుంది
25 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మూడు లక్షల మంది గిరిజన రైతులకు పోడుభూమి పట్టాలు అందజేస్తే పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ 4 లక్షల పైచిలుకు మంది గిరిజనులకు పోడు భూమి పట్టాలని పంపిణీ చేయడం జరిగింది
ఈ ప్రాంతంలో పోడు భూమి పట్టాలు రానటువంటి గిరిజనులకు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పోడుభూమి పట్టాలు ఇప్పించే విధంగా కృషి చేస్తా
వచ్చే ఎన్నికల్లోఈ ప్రాంత గిరిజనులు కారు గుర్తుకు ఓటు వేసి జానారెడ్డి ఆయన కుమారుడికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి.
*ఎమ్మెల్యే స్పీచ్ హైలెట్స్*
జానారెడ్డిని ఈ ప్రాంత ప్రజలు ఏడుసార్లు గెలిపిస్తే ఆయన మాత్రం ఈ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేశారు జానారెడ్డి ఏలువడిలో ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయింది గిరిజనులు వెనుకకు నెట్టి వేయబడ్డారు
చదువుకుంటే పేద ప్రజలు ప్రశ్నిస్తారని జానారెడ్డి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకోడానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేదు
గిరిజనులు కలిసి కూర్చునేందుకు ఒక బంజారా భవన్ కూడా నిర్మించలేదు
35 ఏళ్లు ప్రతిపాదనలకే పరిమితమైన నెల్లికల్లు లిఫ్టును శంకుస్థాపన చేయడంతో పాటు లిఫ్ట్ నిర్మాణం కోసం ఏడు వందల కోట్ల రూపాయలను కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది
D 8, 9 కెనాల్ పై ఏర్పాటు చేసిన లిస్టును ప్రారంభించకుండా ట్రైల్ రన్ నిర్వహించకుండా ఆపేందుకు విశ్వయత్నం చేశారు జానారెడ్డి
మీరు మరోసారి ఆశీర్వదించి నాకు అవకాశం కల్పిస్తే మీ ఇంటి బిడ్డగ, అన్నగా ,తమ్ముడు గా మిగిలిపోయిన పనులన్నిటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తా
36 ఏళ్ల క్రితం స్కూటర్ కూడా లేని జానారెడ్డి నేడు వేల కోట్లకు అధిపతి అయ్యాడు
ఈ ఎన్నికల్లో ఆయన, ఆయన కుమారులు ఇచ్చే డబ్బులు మీవే తీసుకోండి, మీరు కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుపై వేయండి
*ఎమ్మెల్సీ ఎం. సి కోటిరెడ్డి హైలెట్స్*
గెలుపు ఓటమిలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రాంత గిరిజనులకు ఉంది
గిరిజనులు ఎటువైపు ఉంటే గెలుపు అధికారం ఆవైపే ఉంటుంది
2018 తర్వాత ఈ ప్రాంత గిరిజన్లో చైతన్య వచ్చింది ఈ ప్రాంత గిరిజనులు అంతా బిఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారు
వచ్చే శాసనసభ ఎన్నికల్లో నోముల భగత్ కుమార్ ను గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం
నెల్లికలు లిఫ్ట్ పూర్తి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం
రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన తండాలను గ్రామపంచాయతీలు చేయడంతో పాటు గిరిజన రిజర్వేషన్లు పెంచడం జరిగింది.
బిఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గిరిజన తండాల రూపురేఖలే మారిపోయాయి
దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయి
రైతుబంధు, రైతు బీమా కల్యాణ లక్ష్మి వంటి పథకాలు కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాల్లో లేవు
మాయమాటలు చెప్పి మొన్న కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్కడి ప్రజలు హామీలను అమలు చేయాల్సిందిగా నిలదీస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జెడ్పిటిసి అబ్బీడి కృష్ణారెడ్డి,రాష్ట్ర నాయకులు బాబురావు నాయక్, వివేకారావ్,సాదం సంపత్ కుమార్,AIBSS నియోజకవర్గం అధ్యక్షుడు కేతావత్ బిక్షా నాయక్,AIBSS నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ రవి నాయక్, పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జవాజీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మాజీ ఎంపీపీలు కూరాకుల అంతయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్, జిల్లా నాయకులు ఎడవెల్లి మహేందర్రెడ్డి, అల్లి పెద్దిరాజు మరియు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గిరిజన సోదరులు, సోదరీమణులు, ప్రజా ప్రతినిధులు వివిధ అనుబంధ శాఖల నాయకులు పాల్గొన్నారు.