మిర్యాలగూడ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని అదేవిధంగా మిర్యాలగూడ లో మెడికల్ కాలేజీ, పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే , ప్రస్తుత బిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఆయన ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మిర్యాలగూడ నియోజకవర్గంలో 6000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రతి పల్లెలు ఆమ్లెట్లలో కూడా సిమెంట్ రోడ్లు, స్మశాన వాటిక లతో పాటు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం చేయిస్తున్నానని చెప్పారు మిర్యాలగూడ దిశ దశను మార్చే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో తాను ప్రత్యేకంగా కృషి చేశానని మరో ఆరు నెలల్లో యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని ఆ సమయంలో మిర్యాలగూడ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో నిరంతరం విద్యుత్ అంతరాయం అనేది ఉండదని ఈ సందర్భంగా ఒక్కకానించారు . తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి కోసం హర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన నేతృత్వంలో మిర్యాలగూడ ను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నానని చెప్పారు. తెలంగాణలో మరోమారు భారత రాష్ట్ర సమితికి పట్టం కట్టాలని అదేవిధంగా మిర్యాలగూడలో భారత రాష్ట్ర సమితి జెండా మరో మారు ఎగరాలవేయాలని అందుకు ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని కోరారు .తాను మరో మారు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం మిర్యాలగూడను ఉన్నత విద్య, వైద్య వృత్తి వైపు పరుగులు పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. మిర్యాలగూడ ప్రజల చిరకాల స్వప్నము అయిన జిల్లా ఏర్పాటు కు తన వంతుగా కృషిచేసి ముఖ్యమంత్రి చె జిల్లాగా ప్రకటించేందుకు కృషి చేస్తానని చెప్పారు. నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తానని చెప్పారు………… ఈనెల 31న కెసిఆర్ మిర్యాలగూడ పర్యటన…. ఎన్నికల పర్యటనలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రగతి నివేదన, ప్రగతి సభ సందర్భంగా మిర్యాలగూడకు 31వ తేదీ మంగళవారం ముఖ్యమంత్రి మిర్యాలగూడలో పర్యటించనున్నారు. ఆయన సభను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి కి మన విజయ యాత్రను బహుమతిగా ఇవ్వాలనికోరారు. మిర్యాలగూడ ను 6000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి కి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలకాలని మన ఐక్యమత ను అభివృద్ధి ప్రదాతకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జున చారి తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.