*పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్న బీ ఆర్ ఎస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం… . మిర్యాలగూడ ప్రజాలహరి మిర్యాలగూడ ప్రజాలహరి………… డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ …………… ……………… పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడారు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చే రైతు బంధును నవంబర్ రెండో తారీకు లోపల ఇవ్వాలని డిమాండ్ చేశారు . అంతేగాని అసలు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు 15 వేల రూపాయల రైతుబంధును అందిస్తామని మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నది. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిషితిలో లేరు. ఎవరు ఎన్ని సృష్టించిన ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం మిర్యాలగూడలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేసే మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. బీఆర్ఎస్ పార్టీ వారికి గునపాఠం చెప్పటానికి తెలంగాణ ప్రజానీకం మొత్తం ఎదురు చూస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చిరుమర్రి కృష్ణయ్య రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ , కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి , మైనార్టీస్ జిల్లా అధ్యక్షులు సలీం ,ఎన్ ఎఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ , తలకొప్పుల సైదులు , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలికాంత రెడ్డి కాకునూరి బసవయ్య గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బకారెడ్డి ,ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు గారు, మిర్యాలగూడ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగట్ల లింగయ్య యాదవ్, ఓబిసిల్ నియోజకవర్గ అధ్యక్షులు కోట శ్రీనివాసరావు , ఐ ఎన్ టి సి పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు గౌస్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు కుక్కల సురేష్ గూడూరు సర్పంచ్ నూకపొంగ శ్రీనివాస్ , పట్టణ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పోలిశెట్టి అజయ్ , కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.*
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.