*హక్కులకై పోరాడే ఎర్రజెండా ను ఆదరించండి*
*ఈరోజు సిపిఎంలో చేరిన 100 కుటుంబాల చేరిక సందర్బంగా*
*మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి*
ప్రజాలహరి మిర్యాలగూడ… నిరంతరం ప్రజా పోరాటాల నిర్వహిస్తూ ప్రజలకు దక్కాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఎర్రజెండా ఆదరించాలని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం చెందినటువంటి 100 మైనార్టీ కుటుంబాల మహిళలు సిపిఎంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసగించినటువంటి టీఆర్ఎస్ కు మళ్లీ ఓటు అడిగే అర్హత లేదని వారు పేర్కొన్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చి మోసగించినటువంటి టిఆర్ఎస్ కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని వారి పేర్కొన్నారు. TRS, బీజేపీ పార్టీలు ఈ రాష్ట్రంలో ఒకరినొకరు సహకరించుకుంటూ రహస్య ఒప్పందాన్ని కొనసాగిస్తూ ప్రజలను మోసగిస్తున్నాయని వారి కుట్రలు ఎంతో కాలం కొనసాగవని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ మరియు ఇతర నాయకత్వం పాల్గొన్నారు