రైలు పట్టాల కంకరమధ్యన ఆగిపోయిన ట్రాక్టర్.
మిర్యాలగూడ ప్రజాలహరి… నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారు మాడుగుల పెళ్లి వద్ద ఆ గ్రామానికి చెందిన రైతు చెన్నయ్య ట్రాక్టర్పై కట్టెలను చెరువుపల్లి మీదుగా వెళుతుండగా రైలు పట్టాలపై ఉన్న కంకరలో రైలుకు అడ్డంగా పట్టాలకు అడ్డంగా టాక్టర్ ఆగిపోయింది. దీంతో స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ట్రాక్టర్ ఆగిపోయిన సమయంలో గుంటూరు మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ రైలు ను మిర్యాలగూడలో బ్రేక్ చేశారు. స్థానికులు జెసిబి సహాయంతో పక్కకు నెట్టారు. అనంతరం రైలు వెళ్లడానికి మార్గాన్ని క్లియర్ చేశారు. దీంతో పల్నాడు యధావిధిగా రాకపోకలు సాగించింది.