
ప్రజాలహరి మిర్యాలగూడ….బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర రావు గారి ఎన్నికల ప్రచారం అవంతిపురం గ్రామం లో జరిగింది.ఈ ప్రచారానికి అనూహ్య స్పందన వచ్చింది ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మాట్లాడుతూ అంతపురం గ్రామం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాము అవంతిపురం లో సీసీ రోడ్ల తో పాటు మిషన్ భగీరథ లో భాగంగా ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వడం జరుగుతుందన్నారు.2014 నుంచి 2023 వరకు అవంతిపురం గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే భాస్కర రావు గారు పేర్కొన్నారు. అభివృద్ధిని చూసి మళ్ళీ కారు గుర్తుకు ఓటెయ్యాలని అవంతిపురం గ్రామం ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.