
మిర్యాలగూడ ప్రజాలహరి…
.
మిర్యాలగూడ మండలం యాధ్గార్ పల్లి గ్రామానికి చెందిన 100 మంది వివిధ సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లో చేరిన వారందరికీ మిర్యాలగూడ ఎమ్మెలే నల్లమోతు భాస్కర్ రావు గారు గులాబీ కండువాలు వేసి స్వాగతించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరడం సంతోషకరమన్నారు. బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసారు.*
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పాదూరి సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ దుండిగాల యాదమ్మ శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాయి నాయక్, గ్రామశాఖ అధ్యక్షులు చిమట ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు కొండేటి రవి, కొండేటి నాగేందర్, యార శ్రీను, ఎడ్ల వెంకటేశ్వర్లు, షేక్ సుభాన్, పల్లపు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.