
కృష్ణ మూసి సంగమం క్షేత్రం – అపరిశుభ్రతకు కేంద్రం… దామరచర్ల మిర్యాలగూడ ప్రజాలహరి…. కోటి జన్మల పుణ్యఫలము ఇచ్చే పవిత్ర క్షేత్రమైన వాడపల్లి కృష్ణ ముచ్కుంద నదీ సంగమ క్షేత్రము అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి గ్రామము స్వయంభూ క్షేత్రమైన శ్రీ మీనాక్షి అగస్టేశ్వరుడు,
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థము వచ్చే భక్తులు కృష్ణా నదిలో సoగమ క్షేత్రంలో స్థానమాచరించాలని కోరిక ఉన్న ఈ అపరిశుభ్రత వల్ల నిరాశ తోనే స్థానం చేయకుండా నెత్తిమీద నీళ్ళు చల్లుకొని వెళ్లిపోతున్నారు. సoగమ క్షేత్రం కావడంతో అస్థికల కలపడానికి అనేకమంది ఈ ప్రాంతానికి వస్తున్నారు. వచ్చినవారు అస్తికలు, పిండాలు కలపడంతో పాటు వారితోపాటు తెచ్చుకున్న వస్త్రాలను పూజా సామాగ్రిని అక్కడ వదిలేయడంతో ఈ ప్రాంతం చూడ్డానికి భయానకంగా కనిపిస్తుంది. దేవాదాయ శాఖ వారు ఎంతసేపు గుడికి ఆదాయం కోసమే చూడటo తప్ప నదీ తీర ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ధ్యాస లేదు. స్థానిక ప్రజాప్రతినిధులు వారి నేత్రాలకు గంతలు కట్టుకొని ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతకు నిధులు ఇస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేయటం లేదు. ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు, మైనింగ్ ఉండడం వలన గ్రామ పంచాయతీకి ఆదాయం అధికంగా ఉన్న నదీ తీర ప్రాంతాన్ని వార్డులను శుభ్రం చేయుటలో అందరూ విఫలమయ్యారు.