*గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే :-మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు*
దామరచర్ల ప్రజాలహరి
గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదే నని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరావు అన్నారు. శుక్రవారం అడవిదేవులపల్లి మండలంలోని ఉల్సాయి పాలెం, బంగారిగడ్డ తండ, తాడిచెట్టు తండ, ఇందిరానగర్, గాంధీ నగర్, కాల్వకట్ట, గోన్యతండ, బంజార తండ తదితర గ్రామాల్లో ప్రగతి యాత్ర నిర్వహించారు. గిరిజన తండాల (ప్రజలు, మహిళలు తండోప తండాలుగా తరలివచ్చి అపూర్వంగా స్వాగతించారు. గిరిజన మహిళలు సంప్రదాయంగా నృత్య ప్రదర్శనలు చేసి అలరింపజేసారు. పలువురు శాలువాలు, పూల దండలతో అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచార యాత్ర నుద్దేశించి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు మాట్లాడుతూ.. అడవి దేవులపల్లి మండలంలోని ప్రతి తండ, ప్రతీ గ్రామం ప్రజలతో తనకు సుదీర్ఘకాలం అనుబంధం ఉందన్నారు. గ్రామాలు, తండాలు అభివృద్ధిపై సుదీర్ఘకాలం ప్రత్యేక దృష్టి సాధించానని, అందులో భాగంగానే, రోడ్లు, విద్యుత్, సాగునీరు, త్రాగు నీటి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేసానన్నారు. తేలాండ్ భూములు కలిగిన ఈ ప్రాంతానికి లిప్ట్ ఇరిగేషన్ స్కీం మంజూరు చేయించడం జరిగిందన్నారు. పోడు పట్టాలు, అసైన్డ్ భూముల పట్టాలు పంపిణీ చేసామన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్సాయిపాలెం గ్రామ పంచాయితీ పరిధిలోని పలు ఆవాసాలలో అభివృద్ధి పనులు చేపట్టి 19 కోట్లు 3లక్షల 24 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో భాగంగా 11 కోట్ల 7 లక్షల 7 వేల రూపాయలు మంజూరు చేయించానన్నారు. గోన్యా తండా గ్రామ పంచాయితీ పరిధిలోని అభివృద్ధి పనులు, ప్రభా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భాగంగా మొత్తం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి 4. కోల్లు 24 లక్షల రూపాయలు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 2 కోట్లు 76 లక్షల రూపాయలు మంజూరు చేసామని వివరించారు. సీఎం కేస్ఆర్ ప్రభుత్వంలో అనేక పథకాలు తీసుకువచ్చి అమలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలు, తండాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలుతో ప్రజలకు చేరువైన ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ప్రజలంతా ఆనందంగా ఉండటంతో తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పేదప్రజల అభ్యున్నతి కోసం తాను నిరంతరం శ్రమిస్తున్నానన్నది. నవంబర్ 30 న జరుగనున్న సాధారణ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో DCMS వైస్ చైర్మన్ దగ్గింపూడి నారాయణరెడ్డి, ఎంపిపి ధనావత్ బాలాజీ నాయక్, జడ్పిటిసి కుర్రా సేహ్యనాయక్, వైస్ ఎంపిపి కురాకుల మల్లేశ్వరి గోపీనాథ్, మాజీ ఎంపిపి కురాకుల మంగమ్మ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కురాకుల చినరామయ్య, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొత్తు మర్రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ పోలు నాగార్జున, బిఆరెస్ సీనియర్ నాయకులు ఎం. సూర్యానాయక్, ఏఎంసీ చైర్మన్ భైరంబుచ్చయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.