
*యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం తో మహర్దశ*….
*మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు*…
మిర్యాలగూడ ప్రజాలహరి
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 4000 వేల మెగా వాట్లతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం వీర్లపాలెం రెవెన్యూ శివారులో జరగడం వలన ఈ ప్రాంతానికి మహర్ధశ వచ్చిందని మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రగతి యాత్రను దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామంలోని ప్రధాన కూడల్లో ప్రచారం చేశారు. గ్రామంలో అపూర్వ స్వాగతం లభించింది. పలువురు మహిళలు నృత్య ప్రదర్శనలు చేశారు. యువతి యువకులు కేరింతలు కొడుతూ నినాధాలు చేశారు. గ్రామం లోని పలువురు నాయకులు ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ నల్లమోతు భాస్కర్ రావును శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సంధర్బంగా మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడతూ తుంగపహాడ్ వాగు పై వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా రైతాంగానికి తోడ్పాటు అంధించాం అన్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాటశాలల పునరుద్ధరణ కోసం కృషి చేశానన్నారు. పవర్ ప్లాంట్ కింద భూ నిర్వశితులకు నష్టపరిహారం చెల్లించడం తో పాటు హక్కు పత్రాలు అంధచేయడం జరిగిందన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్లో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుతుందన్నారు. గ్రామంలో వివిధ అభివృద్ది పనులు చేపట్టడం ద్వారా మొత్తం 83 కోట్ల 56 లక్షల 78 వేల రూపాయలు ఖర్చు చేశామన్నారు.వివిధ అభివృద్ది పనుల కోసం 54 కోట్ల 47 లక్షల 12 వేల రూపాయలు, అదే విధంగా సంక్షేమ పధకాలను లబ్దిదారులకు 29 కోట్ల 9 లక్షల 66 వేల రూపాయలు అందించామని వివరించారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు.
కార్యక్రమంలో డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, ఎం.పి.పి నందిని రవితేజ, జెడ్పీటీసీ ఆంగోతు లలిత హాతీరాం, వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, వైస్ ఎం.పి.పి కటికం సైదులు రెడ్డి, బి.ఆర్.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, బాల సత్యనారాయణ మాజీ సర్పంచ్ కోట్యానాయక్, మండల యువజన నాయకులు వినోద్ నాయక్, దత్తు నాయక్, లక్ష్మన్, రూపావాత్ సోమ్లానాయక్, బి.ఆర్.ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు..