*గ్రామాల అభివృద్ధితోపాటు గిరిజన తండాలను గ్రామ పంచాయితిలుగా చేసాం*….
మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు…
మిర్యాలగూడ దామరచర్ల…. ప్రజాలహరి
- మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధితోపాటు గిరిజన తండాలను గ్రామ పంచాయితిలుగా తీర్చిదిద్దిన ఘనత కే.సి.ఆర్ ప్రభుత్వానికే దక్కినది అని మిర్యాలగూడ బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారం లో భాగంగా ప్రగతి యాత్రను మండలం లోని కేశవాపురం, రామోజీ తండా, లావూరి భిక్య తండా, నునావాత్ తండా తదితర గ్రామాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రగతి యాత్రను ఉద్దేశించి బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోనే గిరిజన లంబాడా తండాలు అత్యధికంగా దామరచర్ల మండలంలో ఉన్నాయని, తండాలను గ్రామా పంచాయితులుగా అప్ గ్రేడ్ చేసి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. కేశవాపురం, రామోజీ తండా గ్రామ పంచాయితి పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పధకాల అమలు కోసం మొత్తం 97 కోట్ల 7 లక్షల 69 వేల రూపాయలతో ప్రగతి పథంలో ఉందన్నారు, కేశవాపురం గ్రామ పంచాయితి పరిధిలో వివిధ అభివృద్ధి పనులకోసం ప్రత్యేకించి 80 కోట్ల 30 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అదే విధంగా సంక్షేమ పధకాలను లబ్దిదారులకు 16 కోట్ల 70 లక్షల 63 వేల రూపాయలు అందించామని వివరించారు.
లావూరి భిక్య తండా గ్రామ పంచాయితి పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పధకాల అమలు కోసం మొత్తం 2 కోట్ల 65లక్షల 17 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. లావూరి భిక్య తండా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకోసం ప్రత్యేకించి 97 లక్షల 70 వేల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అదే విధంగా సంక్షేమ పధకాలను లబ్దిదారులకు 1కోట్ల 67 లక్షల 46 వేల రూపాయలు అందించామని వివరించారు.
నునావాత్ తండా గ్రామ పంచాయితి పరిధిలో వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ పధకాల అమలు కోసం మొత్తం మొత్తం 4 కోట్ల 22 లక్షల 9 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. నునావాత్ తండా గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకోసం ప్రత్యేకించి 1 కోటి 8 లక్షల 53 వేల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అదే విధంగా సంక్షేమ పధకాలను లబ్దిదారులకు 3 కోట్ల 13 లక్షల 55 వేల రూపాయలు అందించామని వివరించారు.
గిరిజన తండాల సర్వతోముఖాభివృద్ది కోసం సి.యం. కే.సి.ఆర్ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కృషి చేయడం జరిగిందన్నారు. గత పదేళ్లుగా ఈ ప్రాంత అభివృద్దిలో తాను భాగస్వామిగా అయినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, ఎం.పి.పి నందిని రవితేజ, జెడ్పీటీసీ ఆంగోతు లలిత హాతీరాం, వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, బి.ఆర్.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు గుగులోతు సైదా నాయక్, మాలోతు ధస్లీ, శ్రీను నాయక్, ఎం.పి.టి.సిలు, నాయకులు సీతారాములు, లింగా నాయక్, మాలోతు శ్రీను, సాయన్న, ఆడోతు శోభన్ బాబు, మనోహర్, హాగేష్ , మాజీ సర్పంచులు , ఉపసర్పంచులు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు..