*కారు గుర్తుకు ఓటేద్దాం*…
*కె.సి.ఆర్ ను మళ్ళి ముఖ్యమంత్రి ని చేద్దాం*
*బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు*
మిర్యాలగూడ ప్రజాలహరి
దామరచర్ల మండలం నర్సాపురం, శాంతినగర్ గ్రామాలలో మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ అభ్యర్థి శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు ప్రగతియాత్రను మంగళవారం నిర్వహించారు..గ్రామంలో పలువురు మహిళలు బొట్టు పెట్టి ఆశీర్వదించారు..శాలువాలతో సత్కరించారు మహిళలు కోలాట నృత్య ప్రదర్శనలు చేస్తూ స్వాగతించారు.. ప్రగతియాత్రలో భాగంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడారు..నర్సాపురం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాల ద్వారా 15 కోట్ల 36 లక్షల 19 వేల రూపాయలు, శాంతినగర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాల ద్వారా 14 కోట్ల 90 లక్షల 43 వేల 77 రూపాయలు ఖర్చు చేయటం జరిగింది అని తెలిపారు.
నర్సాపురం గ్రామంలో అభివృద్ధి పనుల కోసం 3 కోట్ల 73 లక్షల 9 వేల రూపాయలు, శాంతినగర్ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం 3 కోట్ల 39 లక్షల 59 వేల రూపాయలు ఖర్చుచేశామన్నారు..అదే విధంగా నర్సాపురం గ్రామంలో వివిధ సంక్షేమ పధకాల అమలులో భాగంగా లబ్దిదారులకు 11 కోట్ల 63 లక్షల 10 వేల రూపాయలు, శాంతినగర్ గ్రామంలో 11 కోట్ల 50 లక్షల 83 వేల రూపాయలు వివిధ సంక్షేమ పధకాల అమలులో భాగంగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది అని వివరించారు..దీంతో పాటు యదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూసేకరణ జరిగింది అని, భూ నిర్వాసితులకు నష్ట పరిహార చెల్లింపులతో పాటు భూ నిర్వాసిత హక్కు పత్రాలను పంపిణి చేశామన్నారు..త్వరలో జరగనున్న సాదారణ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశిర్వదించాలని, కె.సి.ఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని ప్రజలను కోరారు…
ఈ కార్యక్రమంలో డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ అంగోతు లలిత హతీరామ్, వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్, రూపావత్ నానుకు ఈశ్వర్ నాయక్, వాంకు డోతు రవీందర్, ఎం.పి.టి.సి మాలోతు మంగ బాలశంకర్, బి.ఆర్.ఎస్ నాయకులు మాలోతు కిషన్ నాయక్, సేవా నాయక్, గుర్రం భాస్కర్ రెడ్డి, నడింపల్లి సైదులు, విజయ్ కుమార్, గ్రామ శాఖ అద్యక్షులు ఇస్లావాత్ సేవా, నడింపల్లి శేఖర్, ఎం.డి షోయబ్, బైరం గోపి, రఫీ, వినోద్ నాయక్, దత్తు నాయక్, నీరుకంటి శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…