సేవ్ కాంగ్రెస్ మహా పాదయాత్ర విజయవంతం… యాత్ర సందర్భంగా సొమ్మసిల్లి పడిపోయిన బిఎల్ ఆర్..
మిర్యాలగూడ ప్రజాలహరి….. సేవ్ కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతం అయింది. పోత్తులో భాగంగా సిపిఎంకు కేటాయించడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు .ముందుగా నియోజకవర్గ పరిధిలోని రాళ్లవాగు తండా లో స్వర్గీయ ధీరావతరాగ్యనాయక్ స్తూపం వద్ద అంజలి ఘటించి అక్కడి నుంచి ర్యాలీగా నాయకులు కార్యకర్తలు మిర్యాలగూడ పట్టణానికి సుమారు 18 కిలోమీటర్లు మహా పాదయాత్ర నిర్వహించుకుంటూ వచ్చారు. మిర్యాలగూడ లో కాంగ్రెస్ పార్టీ కే టికెట్ ఇవ్వాలని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సందర్భంగా సిపిఎంకు కేటాయించడం అన్యాయం అని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే భాస్కరరావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి అభివృద్ధి చేయకుండా కార్యకర్తలను తులనాడని వాడి బదులు చెప్పే సమయంలో ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం ఆయన పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయకుండా భాస్కరరావు ఇష్టారాజ్యంగా వ్యవహరించార ని వీటికి అన్నిటికి ఈ ఎన్నికల గుణపాఠం చెప్పాలన్న సందర్భంలో కార్యకర్తలు ,పార్టీ అనుమతులతో సంబంధం లేకుండా రాష్ట్రస్థాయిలో నిర్ణయాన్ని తీసుకోవడం బాధాకర విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 5000 మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పొదిలి శ్రీనివాస్, తమ్మడబోయున అర్జున్, వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరు బాలు దేశి రెడ్డి శేఖర్ రెడ్డి ,సిద్దు నాయక్, పగడాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు . సొమ్మసిల్లి పడిపోయిన బిఎల్ ఆర్……. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 18 కిలోమీటర్లు నినాదాలు చేస్తూ మహా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో మిర్యాలగూడ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని మిర్యాలగూడ టికెట్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించాలని నినాదాలు చేస్తూ ఆయనకు పూలమాలవేసి అంజలి ఘటించారు. స్థానిక రాజీవ్ గాంధీ బొమ్మ వద్ద బత్తుల లక్ష్మారెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు .ఆయన ను కార్యకర్తలు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన ను పరిశీలించి డాక్టర్లు ఎండ తీవ్రత ఎక్కువ ఉండటం అలుపు సొలుపు లేకుండా పాదయాత్ర చేయటం వలన ఆరోగ్య దెబ్బతిన్నదని మెరుగైన వైద్యాన్ని అందించారు