దామరచర్ల, ప్రజాలహరి మిర్యాలగూడ….. వాడపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామీ దేవాలయంలో మిర్యాలగూడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు గారితో పాటు సతీమణి శ్రీమతి జయ, కుమారులు చైతన్య, సిద్దార్ధ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకాలు చేసారు, ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు, ఘన స్వాగతం పలికారు భాస్కర్ రావు దంపతులను వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాలువాలతో సత్కరించారు దర్శనానంతరం వేదపండితులు భాస్కర్ రావు దంపతులకు ఆశీర్వచనం అందించారు, ఆలయ చైర్మన్ కొందుటి సిద్దయ్య వారికీ తీర్థప్రసాదాలను అందజేశారు..
అనంతరం దామరచర్ల మండలంలోని వాడపల్లి గ్రామంలో వాడవాడల ప్రగతియాత్రను చేపట్టారు, ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పధకాల కరపత్రాలను అందజేసారు.వీదుల్లో మహిళా కోలాట బృందం స్వాగతం పలకగా పలువురు మహిళలు హరతులతో ఆశీర్వదించారు. ప్రగతి యాత్రను ఉద్దేశ్జించి బి.ఆర్.ఎస్ (భారత రాష్ట్ర సమితి) ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారు మాట్లాడుతూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధి కోసం కె.సి.ఆర్ ప్రభుత్వం నిరంతరం పాటు పడుతుంది అని అన్నారు, కె.సి.ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది అని అన్నారు, పేద ప్రజల సంక్షేమం కోసం వివిధ పధకాలను ప్రవేశ పెట్టి అమలు చేసిన ఘనత తమదేనన్నారు, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందించడం జరుగుతుంది అని అన్నారు, వాడపల్లి గ్రామంలో వివిధ అభివృద్ధి, సంక్షేమం పధకాల కోసం 35 కోట్ల 1 లక్ష 39 వేల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అని తెలిపారు,
గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా 11 కోట్ల 56 లక్షల 36 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు, మిషన్ భగీరధ పధకం కింద 1 కోటి 93 లక్షల రూపాయలు, 15వ ఆర్ధిక సంఘ నిధులు 2 కోట్ల 43 లక్షల రూపాయలు, రోడ్ల కోసం పంచాయత్ రాజ్ శాఖ ద్వారా 5 కోట్ల 90 లక్షల రూపాయలు, R&B శాఖ ద్వారా 98 లక్షల రూపాయలు, విద్యుత్ సరఫరా కొరకు విద్యుత్ శాఖ ద్వారా 2 లక్షల 25 వేల రూపాయలు, తెలంగాణ పల్లె ప్రగతి కింద 21 లక్షల 70 వేల రూపాయలు, మన ఉరు మన బడి పధకం ద్వారా 8 లక్షల 57 వేల రూపాయల నిధులను ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేపట్టామని వివరించారు…
గ్రామంలో వివిధ సంక్షేమ పధకాల ద్వారా లబ్దిదారులకు 23 కోట్ల 45 లక్షల రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందన్నారు, ఆసరా పెన్షన్లు పంపిణి కింద 629 మంది లబ్దిదారులకు ఇప్పటి వరకు 11 కోట్ల 68 లక్షల రూపాయలు, కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ పధకం కింద 148 మంది లబ్దిదారులకు 1 కోటి 42 లక్షల రూపాయలు, రైతు బంధు పధకం కింద 905 మంది లబ్దిదారులకు 5 కోట్ల 38 లక్షల రూపాయలు, సి.ఎం సహాయనిధి ద్వారా 80 మందికి 27 లక్షల 71 వేల రూపాయలు, రైతు భీమా పధకం కింద 3 రైతు కుటుంభాల నామినిలకు 15 లక్షల రూపాయలు, 630 మంది రైతులకు ప్రీమియం చెల్లింపు లో భాగంగా 1 కోటి 19 లక్షల రూపాయలు, కులవృత్తులకు చేయూత నిచ్చే విధంగా బి.సి బంధు పధకంలో భాగంగా 6 గురు లబ్దిదారులకు 6 లక్షల రూపాయలు, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణి, చేపల పంపిణి, కె.సి.ఆర్ కిట్లు, కంటి వెలుగు తదితర సంక్షేమ పధకాల కోసం నిధులను ఖర్చు చేయడం జరిగింది అని వివరించారు, అంతేకాకుండా రానున్న ప్రభుత్వంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పధకాలను అమలు చేస్తామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి గారు, డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, ఎం.పి.పి నందిని రవితేజ, జెడ్పీటీసీ అంగోతు లలిత హతీరామ్, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, బి.ఆర్.ఎస్ పార్టీ దామరచర్ల మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, సర్పంచ్ కొందూటి మాధవి, కొత్త మర్రెడ్డి, ఎం.పి.టి.సి కామేపల్లి అనంతలక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ అద్యక్షులు చిట్టిపోలు సైదయ్య, బుల్లెట్ ఆనంద్, ఆశీర్వాదం, బైరం గోపి, కొందుటి బుజ్జి, నీరుకంటి శ్రీనివాస్, వినోద్ నాయక్, లాల్, తదితరులు పాల్గొన్నారు…