మిర్యాలగూడ ప్రజాలహరి,.. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీలో ఆవేశం ఆక్రోషం కట్టలు తెంచుకుంది .మిర్యాలగూడ నియోజకవర్గ స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు భారీ ఎత్తున ఈ రోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ భవనంలో సమావేశమయ్యారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే టికెట్ ను పొత్తులో భాగంగా సిపిఎం కాకుండా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు .గత కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీ ఆగడాలతో ఇబ్బందులు పడుతూ ఈసారి ఎలాగైనా మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఉత్సాహంతో ఉన్న సందర్భంలో పొత్తులు అంటూ సిపిఎంకు కేటాయించటం సహించమని అలా చేసినట్లయితే ఎవరికి కాంగ్రెస్స సహకరించేది లేదనీ మిర్యాలగూడ కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, పొదిలి శ్రీనివాస్, నూకల వేణుగోపాల్ రెడ్డి, అర్జున్ తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు అందరూ పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడుతుంటే ఇప్పుడు పొత్తు అంటూ గెలిచే సీటును సిపిఎం కేటాయించటం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు. రేపు ఉదయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వివరించారు.మిర్యాలగూడ కాంగ్రెస్ లో రగిలిన అసంతృప్తి.సేవ్ కాంగ్రెస్ సేవ్ మిర్యాలగూడ నినాదమిస్తున్న కాంగ్రెస్ నేతలు.మిర్యాలగూడ స్థానాన్ని సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ సి పిఎం కు కేటాయించొద్దని డిమాండ్.సిపిఎం కి కేటాయిస్తే తాము సహకరించమని తేల్చి చెప్పిన మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భక్తుల లక్ష్మారెడ్డి (BLR)
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.