ప్రజల కాళ్లు మొక్కి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం
మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ను కాంగ్రెస్ పార్టీకి కేటాయించకపోతే మేము ఏ త్యాగానికైనా సిద్ధం
విషయం : మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కి కేటాయించుట గురించి
మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పొత్తులలో భాగంగా సిపిఎం కు కేటాయిస్తే మేము సహించేదే లేదు
సర్వే రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టికెట్లు కేటాయించకపోతే మేము ఏ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారని ఈ తరుణంలో ప్రజలను అయోమయానికి గురిచేసి కాంగ్రెస్ పార్టీ మరో తప్పు చేయొద్దని కోరుకుంటున్నాం
మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు ఇలాంటి తరుణంలో పొత్తులలో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సిపిఎం పార్టీకి కేటాయిస్తున్నట్లుగా టీవీ ఛానల్ లో విష ప్రచారం జరుగుతుంది మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అందరూ ఇక్కడ సర్వే రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే సీటు కేటాయించాలని కోరుకోవడం జరుగుతుంది సిపిఎంకు కేటాయించిన పక్షంలో ఏ ఒక్క నాయకుడు కార్యకర్త కూడా దానికి సహకరించే అవకాశమే లేదని అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలు కూడా సిపిఎం పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా లేరని తమరికి విన్నవించుకుంటున్నాము దయచేసి మిర్యాలగూడ సీటును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే కేటాయిస్తున్నట్లుగా ప్రకటన చేయాలని మేము సవినయంగా కోరుకుంటున్నాము
గెలిచే స్థానాన్ని సిపిఎం కు కేటాయించి చేజేతుల ఆ స్థానాన్ని కోల్పోకూడదని గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థికి 11221 ఓట్లు వచ్చాయి ఈసారి ఎన్నికల్లో వారికి 5000 ఓట్లను కూడా మించే పరిస్థితి లేదు మిర్యాలగూడ నియోజకవర్గంలో వామపక్ష పార్టీలు పూర్తి ఆదరణను కోల్పోయి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాయి
కావున ఎట్టి పరిస్థితుల్లోనైనా మిర్యాలగూడ సీటును కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాము
అదేవిధంగా సేవ్ కాంగ్రెస్ సేవ్ మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ అనే నినాదంతో రేపు ఉదయం 6 గంటలకు దామచర్ల మండలం రాళ్లవాగు తండా లోని రాగియా నాయక్ స్తూపం నుండి మిర్యాలగూడ రాజీవ్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర నిర్వహించ తలపెట్టామని దీని ప్రధాన ఉద్దేశం మిర్యాలగూడ నీ అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడో వారికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని వారికి మేమందరం తోడుగా ఉండి కాంగ్రెస్ పార్టీ జెండాను మిర్యాలగూడలో ఎగురవేస్తామని ఈ నిరసన ర్యాలీ ద్వారా తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశం