ప్రజాలహరివేములపల్లి ….మండలం ఆమనగల్ గ్రామంలోని శ్రీ.శ్రీ.శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని మిర్యాలగూడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ (భారత రాష్ట్ర సమితి) అభ్యర్థి .నల్లమోతు భాస్కర్ రావు సోమవారం ప్రారంభించారు, ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసానన్నారు, అందులో భాగంగా మండలంలోని ఆమనగల్ గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం 6 కోట్ల 48 లక్షల రూపాయలు మంజూరు చేయించి పనులు చేపట్టడం జరిగింది అని అన్నారు, మిషన్ భగీరధ పధకం కింద 1 కోటి 50 లక్షల రూపాయలు, 15వ ఆర్ధిక సంఘ నిధులు 1 కోటి 54 లక్షల రూపాయలు, రోడ్ల కోసం పంచాయత్ రాజ్ శాఖ ద్వారా 2 కోట్ల 45 లక్షల రూపాయలు, విద్యుత్ సరఫరా కొరకు విద్యుత్ శాఖ ద్వారా 11 లక్షల రూపాయలు, తెలంగాణ పల్లె ప్రగతి కింద 12 లక్షల రూపాయలు, మన ఉరు మన బడి పధకం ద్వారా 86 లక్షల రూపాయల నిధులను ఖర్చు చేసి అభివృద్ధి పనులను చేపట్టామని వివరించారు, సంక్షేమ పధకాలు అమల్లో భాగంగా ఆమనగల్ గ్రామంలో 44 కోట్ల 68 లక్షల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది అని అన్నారు, ఆసరా పెన్షన్ లు పంపిణి కింద 633 మంది లబ్దిదారులకు ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయలు, కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ పధకం కింద 101 మంది లబ్దిదారులకు 1 కోటి రూపాయలు, రైతు బంధు పధకం కింద 1913 మంది లబ్దిదారులకు 24 కోట్ల రూపాయలు, సి.ఎం సహాయనిధి ద్వారా 55 మందికి 28 లక్షల రూపాయలు, రైతు భీమా పధకం కింద 32 మంది రైతు కుటుంభాల నామినిలకు 2కోట్ల రూపాయలు, 1242 మంది రైతులకు ప్రీమియం చెల్లింపు లో భాగంగా 2 కోట్ల రూపాయలు, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణి, చేపల పంపిణి, కె.సి.ఆర్ కిట్లు, కంటి వెలుగు తదితర సంక్షేమ పధకాల కోసం నిధులను ఖర్చు చేయడం జరిగింది అని వివరించారు, త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో నన్ను మీలో ఒకడిగా ఆదరించి, ఆశిర్వదించాలని కోరారు…గత పదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం కోసం శాయశక్తులా కృషి చేస్తునన్నారు, పార్టీ కార్యకర్తలు సైనికులుగా పని చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి గారు, మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ పేరాల కృపాకర్ రావు, సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, పునాటి లక్ష్మీనారాయణ, ఎం.పి.టి.సి మేక లలిత రవి, పేరాల గుర్వరావు, మేక దేవరాజ్, వల్లంపట్ల వెంకన్న, గ్రామశాఖ అద్యక్షులు పేరాల రమేశ్, కోలపాపయ్య, బరిగెల సత్యనారాయణ, ప్రసాద్, వీరేందర్, వెంకటేష్, ఆలయ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.