ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
*తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపద్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ని ఉల్లగించే వారి పై నల్లగొండ జిల్లా పోలీసుల పకడ్బందీ చర్యలు*
*అంతర్-రాష్ట్ర సమీకృత చెక్ పోస్ట్ వాడపల్లి వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 3.04 కోట్ల నగదు,(18 లక్షల) విలువ గల ఒక కియా కార్*
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అంతర్-రాష్ట్ర చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేసే నగదు,మద్యం,మరియు మాదకద్రవ్యాలు అక్రమ రవాణాను అరికట్టడానికి తేదీ 06-10-2023 నుండి నల్లగొండ జిల్లా నందు మూడు అంతర్-రాష్ట్ర చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేయడం జరుగుతుంది. దీనిలో బాగంగా ఈ రోజు ఉదయం 5.30 గంటలకు మాడుగులపల్లి టోల్ గేట్ వద్ద యస్.ఐ మరియు సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా ఒక తెలుపు రంగు వాహనం ఆపకుండా వెళ్ళగా ఇదే విషయాన్ని మాడుగులపల్లి పోలీసులు రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న మిర్యాలగూడ డియస్పీ ని అప్రమత్తం చేశారు. మిర్యాలగూడ డియస్పి 2 టౌన్ ఇన్స్పెక్టర్ నరసింహ రావుని అప్రమత్తం చేయగా వారు ఈదులుగూడ సిగ్నల్ వద్ద ఆపడానికి ప్రయత్నిచగా సదరు వెహికిల్ ఆపకుండా వెళ్ళగా వాడపల్లిలోని అంతర్రాష్ట్ర మరియు ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టును మళ్లీ అప్రమత్తం చేశారు. అక్కడ ఎస్‌ఐలు రవికుమార్, క్రాంతికుమార్ బృందాలు బారికేడ్‌లు వేసి వాహనాన్ని ఆపి తనికి చేయగా అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని విచారించి వాహనాన్ని తనికి చేయగా వాహనంలో ని సీట్ క్రింది బాగంలో రహస్య గదులు తయారు చేసుకొని అందులో 3.04 కోట్ల అక్రమంగా డబ్బు దాచినట్లు గుర్తిచడం జరిగింది.
అనుమానితుల వివరాలు:
1) విపుల్ కుమార్ భాయ్, వయస్సు 46 సంవత్సరాలు, Occ: డ్రైవర్, R/o ముషీరాబాద్, n/o. అమ్హదాబాద్, గుజరాత్.
2) అమర్‌సిన్హ్ జాలా, వయస్సు 52 సంవత్సరాలు, Occ: డ్రైవర్, R/o మహేసేన, గుజరాత్.
పై నిందితులపై ర్యాష్ డ్రైవింగ్ మరియు హైవేపై ప్రయాణీకుడికి ప్రమాదం కలిగించడం మరియు తనిఖీ చేసే పోలీసు అధికారికి విధేయత చూపకపోవడం మరియు వాహనం యొక్క రూపం మార్చి ప్రత్యేకమైన చాంబర్ యేర్పాటు చేసినందుకు (U/s. 336 IPC; MVAct యొక్క 179, 52/177 మరియు 102 CrPC) కేసు నమోదు చేయబడింది.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డియస్పీ యై.వెంకట గిరి గారి ఆద్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు నరసింహారావు, సత్యనారాయణ, యస్.ఐ లు రవికుమార్, క్రాంతికుమార్ మరియు సిబ్బందిని జిల్లా యస్పీ గారు అభినందించారు.
*శాంతి యుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించు కోవాలి జిల్లా యస్పీ*
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపద్యంలో జిల్లా ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్చ గా వియోగించుకొనుటకు ఓటర్లు ఎలాంటి ప్రలోబాలకు గురి చేయకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాము. దీనిలో బాగంగా ఇప్పటి వరకు 2800 మందిని బైండవర్ చేయడం జరిగింది.ఏవరైనా ఎన్నికల కోడ్ ఉల్లగించి శాంతి బద్రతలకు విఘాతం కల్పిస్తే డైయల్ 100 గాని సంబందిత పోలీసు అదికారులకు తెలియ పరచగలరు.
ఎన్నికల కోడ్ నేపద్యంలో జిల్లా పోలీసు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 7.39 కోట్ల నగదు, 40 లక్షల విలువగల మద్యం, 1.71 కోట్ల విలువ గల గంజాయి,80 లక్షల విలువ గల గోల్డ్ పట్టుకోవడమైనది.