ఉత్కంఠగా సాగిన అంబేద్కర్ యువజన సంఘ ఎన్నికలలో గెలుపొందిన పుట్టల అనిల్
వేములపల్లి అక్టోబర్ 15 ( ప్రజాలహరి)
మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘ ఎన్నికలో పుట్టల అనిల్ తన ప్రత్యర్థి బచ్చలకూరి కోటేష్ పై విజయం సాధించారు. సంఘలో మొత్తం 239 సభ్యులుగ ఉండగా అందులో 150 ఓట్లు పోల్ అయ్యాయి.ఈ సంఘ ఎన్నికలో పుట్టల అనిల్ కు 102 ఓట్లు రాగా బచ్చలకూరి కోటేష్ కు 48 ఓట్లు పోలయ్యాయి. కాగాకోటేష్ పై పుట్టల అనిల్ 54 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ సంఘ సభ్యులు నాపై నమ్మకంతో రెండవసారి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సంఘ అభివృద్ధికి తోడ్పడుతానని ఆయన అన్నారు.