బీ-ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భవన్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మితగా వారికి రేపు బీ-ఫారాలు అందిస్తామన్నారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారమ్ అందుకున్నారు. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. బీ-ఫారమ్ అందుకున్న వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, షకీల్, జాజాల సురేందర్, గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, పట్నం నరేందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్, పువ్వాడ అజయ్, లింగాల కమల్ రాజ్, సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వర్ రావు, మెచ్చా నాగేశ్వర్ రావుతో పాటు పలువురు అందుకున్నారు.
[15/10, 2:45 pm] Ameed Shaik Mla: పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి
సౌభాగ్యలక్ష్మీ పథకం కింద బీపీఎల్ కింద ఉన్న పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి
#brsmanifesto
[15/10, 2:46 pm] Ameed Shaik Mla: ఆరోగ్య శ్రీ 15 లక్షలకు పెంపు
ఆరోగ్య శ్రీ పరిధిని రూ.15లక్షలకు పెంచుతాం. జర్నలిస్టులకు రూ.15లక్షల వరకు ఉచిత వైద్య సేవలు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పార్టీ వాళ్లు పేరు పెట్టారు.
జర్నలిస్టులకు కూడా 400 కే గ్యాస్ సిలిండర్
జర్నలిస్టులకు కూడా వాళ్ల ఆదాయంతో సంబంధం లేకుండా రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. అక్రిడేషన్ ఉన్న జర్నిలిస్టులు అందరికీ 400 కే సిలిండర్ అందజేస్తాం. పేద మహిళలకు 400కే గ్యాస్ సిలిండర్
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు, గ్యాస్ ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై అడ్డగోలు భారం మోపుతుంది. తెలంగాణలో చాలామంది మళ్లీ గ్యాస్ స్టవ్‌లు మానేసి కట్టెల పొయ్యిలు వాడుతున్నారు. ఈ బాధలు పోవాల్సి ఉంది. అందుకే అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందజేయాలని నిర్ణయించాం.
: రైతుబంధు 16 వేలకు పెంపు
మొదటి సంవత్సరం రూ.12వేలకు పెంచుతాం. తర్వాత ప్రతి ఏడాది విడతలవారీగా రూ.16వేలకు పెంచుతా….ఆసరా పెన్షన్లు రూ.5వేలకు పెంపు : సీఎం కేసీఆర్
పదులు, వందల్లో ఉన్న పెన్షన్లలో ఉన్న స్కీంను వెయ్యిల్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్ అన్నారు. వెయ్యి రూపాయలతో మొదలుపెట్టి.. ఆర్థిక సౌష్టవం పెరిగిన తర్వాత 2016 చేసుకున్నాం. ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న కొద్దీ పెన్షన్లను పెంచుకుంటూ పోయాం. ఇప్పుడు 5 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం….తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు సన్నబియ్యం
దీంతో పాటు రాష్ట్రంలో ఇంకో స్కీం తేవాలని నిర్ణయించాం. తెలంగాణలో ఆకలి పోయింది. హాస్టల్స్‌లో పిల్లలకు సన్నబియ్యం, అంగన్‌వాడీలో కూడా అందిస్తున్నాం. అన్నపూర్ణగా తయారైన రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు వచ్చే ఏప్రిల్, మే నుంచి సన్నబియ్యం ఇస్తాం. ఇక దొడ్డుబియ్యం బాధ ఉండదు. ఈ స్కీంకు తెలంగాణ అన్నపూర్ణ అని పేరు పెడుతున్నాం. ప్రభుత్వంలోకి రాగానే ఇంప్లీమెంట్ చేస్తాం.ప్రజలందరికీ ఉచిత బీమా : కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1.10 లక్షల కుటుంబాలకు 93 లక్షల పైచిలుకు రేషన్ కార్డులు ఇచ్చాం. వందకు వంద శాతం ప్రీమియం చెల్లించి రైతుబీమా తరహాలో ఈ కుటుంబాలు అన్నింటికీ కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికీ ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్‌ఐసీ ద్వారానే ఈ బీమా కల్పించనున్నాం.◾ *|| బీఆర్ఎస్ మ్యానిఫెస్టో 2023 ||* ◾
▪️ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు.
▪️అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
– సీఎం కేసీఆర్
▪️తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం – సీఎం కేసీఆర్
▪️రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం – సీఎం కేసీఆర్.
▪️ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు
▪️అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
▪️వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు
▪️రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు
▪️మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇస్తాం.
▪️అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3000 అందిస్తాం.
▪️అర్హులైన లబ్దిదారులకు, అక్రిడేశన్ కలిగిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్…
=================బీఆర్‌ఎస్ మేనిఫెస్టో: రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం.. నెలకు పింఛన్ రూ.5 వేలకు పెంపు.. ప్రజలందరికీ రూ.5 లక్షల కేసీఆర్ బీమా.. దళిత బంధు కొనసాగింపు.. మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట, బడ్జెట్ పెంపు.. రైతు బంధుతో పాటు రైతు భీమా కొనసాగింపు