సమాచార హక్కు చట్టం గురించి ప్రజలందరికీ అవగాహన ఉండాలి: దళితరత్న కొత్తపల్లి సైదులు
సమాజంలోని ప్రతి పౌరుడికి సమాచార హక్కు చట్టం గురించి అవగాహన ఉండాలని అలాగే ప్రతి గవర్నమెంటు ఆఫీస్ నందు ఉద్యోగస్తులకు మరియు సమాచార అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సమాచారం అడిగే కార్యకర్తలు మరియు పౌరులు పారదర్శకంగా ఉండాలని అధికారులు కూడా తమ యొక్క విధులను నిజాయితీగా చేస్తూ సమాజానికి ఆదర్శం గా ఉండాలని కోరుతూ. మా కమిటీ తరుపున పుస్తక పంపిణీ లు మరియు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు చైతన్యం తెచ్చి ,పలు అధికారులకు కూడా అవగాహన పెంచామని ప్రభుత్వాలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ.. సహచట్టం 2005 ఆక్టోబర్ 12న దేశమంతా అమలై ఇప్పటికీ 18సం..పూర్తయిన సందర్భంగా అధికారులకు, అనధికారులకు పౌరులకు, సహచట్ట కార్యకర్తలకు పట్టణ కమిటీ తరుపున శుభాకాంక్షలు తెలుపుతున్న సమాచార హక్కు చట్టం సలహాలు ,సూచనలు, పరిరక్షణ సమితి పట్టణ అధ్యక్షుడు దళితరత్న కొత్తపల్లి సైదులు.