అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలులో భాస్కర్ రావు భేష్
* మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో పుంతలు తొక్కిస్తున్న ఎన్బీఆర్
* అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలి
* ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలి
* సోషల్ మీడియా ను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి కేటీఆర్
మిర్యాలగూడ ప్రజాలహరి..
అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలులో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని, ఆయన సేవలు అద్వితీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎన్బీఆర్ ప్రగతి పథంలో సరికొత్త పుంతలు తొక్కిస్తున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తొమ్మిదేండ్లలో జరిగిన అభివృద్ధి, కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై రూపొందించిన పుస్తకాన్ని ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఎన్బీఆర్ సారథ్యంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరింత బలోపేతం అయ్యాయని ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలంతా ప్రజా క్షేత్రంలో ఉండాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాస్కర్ రావు హ్యాట్రిక్ కొట్టాలని ఆకాంక్షించారు. ప్రచారస్త్రంగా సోషల్ మీడియా ను సద్వినియోగం చేసుకోవాలని భాస్కర్ రావుకు కేటీఆర్ సూచించారు.