* నల్లమోతు భాస్కర్ రావుతోనే మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి
* నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 10న నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభవృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతోనే సాధ్యమని ఆయన పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాస్కర్ రావు బంపర్ మెజారిటీతో గెలుపొందుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులుగా భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిర్యాలగూడ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు, ఎల్వోసీ చెక్కులను అధిక సంఖ్యలో మంజూరు చేయించిన ఘనత భాస్కర్ రావు కే దక్కుతుందని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో భాస్కర్ రావు సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల పకడ్బందీ అమలుకు ఆకర్షితులై కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుందని చెప్పారు. రైతాంగానికి దన్నుగా బీఆర్ఎస్ సర్కార్ నిలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికి దిక్సూచిగా మారాయని అన్నారు. రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి పకడ్బందీగా అమలుచేస్తున్నారని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా నల్లగొండ జిల్లాలో 11 విడతల్లో 5,09,000 మంది రైతులకు రూ.5,800 కోట్లు పంపిణీ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్ కే దక్కిందన్నారు. రైతన్న మృతి చెందితే ఆయన కుటుంబం వీధినపడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు సాయం అందిస్తున్నదన్నారు. నల్లగొండ జిల్లాలో రైతు బీమా పథకం ద్వారా 6996 మంది రైతు కుటుంబాలకు రూ.34.98 కోట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు