
పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలి
మిషన్ భగీరథ పనులు పూర్తయి రెండేళ్లయిన పైసా విడుదల చేయలేదు
మిర్యాలగూడ: బీఆర్ఎస్ ప్రభుత్వ కాలనీలో ఉన్న కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ డీసీసీబీ సజ్జల రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ..2020 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు కాంట్రాక్టర్లు ఎంతో వ్యాయా ప్రయాసలకోర్చి పనులు చేస్తే నేటి వరకు చెల్లించకపోవడం దారుణం అన్నారు ఒక్క నల్గొండ జిల్లాలోనే దాదాపు 250 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నాయన్నారు గత రెండేళ్లుగా కాంట్రాక్టర్లు తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు మిర్యాలగూడ నియోజకవర్గంలో దాదాపు 500 కోట్ల మేర మిషన్ భగీరథ కు నిధులు కేటాయించగా కేవలం 200 కోట్లు మాత్రమే ఇప్పటివరకు వచ్చాయన్నారు. ఇందులో రావలసిన 300 కోట్లకు 20 కోట్లకు ఇప్పటికే టోకెన్ నెంబర్లు సైతం వచ్చినప్పటికీ గత రెండు సంవత్సరాల నుండి ఎదురుచూపులు తప్ప డబ్బులు మాత్రం రాలేదన్నారు అదేవిధంగా పంచాయతీరాజ్ పనులకు 20 కోట్ల రూపాయలు పెండింగ్ రోడ్లు రహదారులు 30 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖకు గత ఏడాది మంత్రి కేటీఆర్ ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన సభలో మిర్యాలగూడకు 100 కోట్ల రూపాయలను కేటాయించారు అందులోనుండి 20 కోట్ల రూపాయలకు మాత్రమే పనులు చేపట్టగా మిగిలిన పనులకు అతి గతి లేదన్నారు మంత్రి కేటీఆర్ గతంలో ఇచ్చిన మిగిలిన పనుల హామీలను నెరవేర్చి కొత్త పథకాలకు హామీలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీటీసీ ఇజ్రాయిల్, చలపతిరావు, మేకల సైదిరెడ్డి,బారెడ్డి విటల్ రెడ్డి,సారెడ్డి శంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.