10న మంత్రి కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
* ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు
ప్రజాలహరి మిర్యాలగూడ ..
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 10న మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సంద్భంగా పలు అభవృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత తొమ్మిది ఏండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల అజెండాతో ప్రజా ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టనున్నట్టు గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులుగా భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మిర్యాలగూడ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తోంది. మిర్యాలగూడ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహయనిధి చెక్కులు, ఎల్వోసీ చెక్కులను అధిక సంఖ్యలో మంజూరు చేయించిన ఘనత భాస్కర్ రావు కే దక్కుతుంది.