సమరశీల ఉద్యమాల ద్వారానే జిల్లా సాధ్యం:- కస్తూరి ప్రభాకర్, రతన్ సింగ్, మునీర్
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు సమరశీల ఉద్యమాల ద్వారానే సాధ్యమని టిటిఎఫ్ కన్వీనర్ కస్తూరి ప్రభాకర్, బిజెపి మిర్యాలగూడ నియోజకవర్గ కన్వీనర్ భానావత్ రతన్ సింగ్ నాయక్, జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అహ్మద్ మునీర్ షరీఫ్ లు అన్నారు. మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్యర్యంలో చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారం 8వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో క్లాత్ మర్చేంట్ అసోసియేషన్ అధ్యక్షులు నీలా మోహన్ రావు,ప్రధాన కార్యదర్శి ప్రసాద్ రావు, ఉపాధ్యక్షులు రాపోలు శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు చీదళ్ల మాణిక్యం,కిషన్,ప్రసాద్,ముక్క ప్రదీప్,హరి ప్రసాద్, పాండు రంగయ్య,రామ నర్సయ్య, రంగా వేంకటేశ్వర్లు,బిజెపి నాయకులూ పులి విద్యాసాగర్, విజయ్ నాయక్, నాగిరెడ్డి, సుబ్రమణ్యం,నాగరాజు, సీతారాంరెడ్డీ,నరేష్,రమేశ్ లు కూర్చున్నారు.ఈ సంధర్భంగా వారు మాట్లడుతూ తెలంగాణ ఉద్యమం సాగిన రీతిలో మిర్యాలగూడ జిల్లా సాధన ఉద్యమం కొనసాగాలని సూచించారు. భౌగోళిక,ఆర్థిక వనరులు వున్న మిర్యాలగూడను జిల్లాగా చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని చెప్పారు. మంత్రి కేటిఆర్ మిర్యాలగూడలో వచ్చే సందర్భంలో జిల్లా ప్రకటన చేయాలని కోరారు. దీక్షలకు రెఢీమేడ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్ రెడ్డి,మధు,గణేష్,రాము, రాఖీ,సతీష్,శ్రీను,మదన్, భానుమూర్తి,ప్రసాద్,గోపి లుసంఘీభావం తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు డాక్టర్ రాజు,దశరథ్ నాయక్, దాసరాజు జయరాజు, జనయేత్రి ఫౌండేషన్ సభ్యులు పోగుల సందీప్, తాజ్ బాబా, అమీర్ అలీ, జనిపాష, రవి కుమార్, అజహర్,శ్రీను,అలేముద్దిన్, గౌరు శ్రీనివాస్ జోసెఫ్,తదితరులు పాల్గొన్నారు.