మిర్యాలగూడ ప్రజాలహరి …
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. పరిరక్షణకు ప్రజల యొక్క భద్రతపై భరోసా కల్పించడానికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో కమాండర్ టీ పి భాఘెల్ మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి తన సిబ్బందితో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి.పట్టణంలోని పలువార్డులలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటగిరి మాట్లాడుతూ.ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాడం జరిగింది ప్రజలకు భద్రతా భరోసా కల్పించడానికి పలు వీధుల గుండా రూట్ మార్చ్ శాంతి పద్ధతులను కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్నామని అందులో భాగంగానే ముందస్తు భద్రత చర్యలు చేపడుతున్నామని అందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.