నిరుద్యోగుల ఆశాదీపం ఎన్బీఆర్ ఫౌండేషన్
* మిర్యాలగూడ యువతకు బాసటగా నల్లమోతు సిద్దార్థ
* కానిస్టేబుల్ తుది రాత పరీక్షల ఫలితాలలో సత్తా చాటిన ఎన్బీఆర్ ఫౌండేషన్ విద్యార్థులు
మిర్యాలగూడ, ప్రజాలహరి..
నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన నల్లమోతు భాస్కర్ రావు (ఎన్బీఆర్) ఫౌండేషన్ నిరుద్యోగుల పాలిట ఆశాదీపం గా మారింది. మిర్యాలగూడ నియోజకవర్గ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ కృతకృత్యులయ్యారు. ఆయన అవిశ్రాంత, అవిరామక కృషి ఫలితంగా ఎందరో నిరుద్యోగ అభ్యర్థుల కుటుంబాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. మిర్యాలగూడ యువతకు నల్లమోతు సిద్దార్థ బాసటగా నిలుస్తున్నారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందినట్టయిటే జాబ్ పక్కా అనే ట్రెండ్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఉద్యోగార్థుల వద్ద నుంచి నయా పైసా ఆశించకుండా స్టేట్ టాప్ ఫ్యాకల్టీల సేవలను వినియోగించుకుంటూ ఉచిత శిక్షణ అందించడంతో పాటుగా ఉచితంగా స్టడీ మెటిరీయల్ పంపిణీ చేయడం ఒక్క నల్లమోతు సిద్దార్థ కే సాధ్యమని నిరుద్యోగ యువత అభిప్రాయపడుతున్నారు. గ్రూప్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ అందిస్తూ ఎన్బీఆర్ ఫౌండేషన్ మేటి సంస్థగా ప్రముఖుల మన్ననలను సొంతం చేసుకున్నది. తాజాగా, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఇటివల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షల ఫలితాలలో ఎన్బీఆర్ ఫౌండేషన్ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 20 మంది సివిల్, ఏఆర్ విభాగాల్లో ఎంపిక కాగా, ఒకరు ఏఆర్ ఎస్సైగా ఎంపికయ్యారు. వీరంతా శనివారం మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావును, నల్లమోతు సిద్దార్ధ ని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కొలువులకు ఎంపికైన అభ్యర్థులను భాస్కర్ రావు, నల్లమోతు సిద్దార్థ ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలను సాధించిన ఎన్బీఆర్ ఫౌండేషన్ విద్యార్థులను శాలువాలు, పూలమాలలతో నల్లమోతు సిద్దార్థ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరం బుచ్చయ్య(సంపత్), మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, ఉపాధ్యాయులు సుద్దుల సైదులు, వెంకటరత్నం, శిరసన గండ్ల శ్రీకాంత్ చారి, గ్రంథాలయ ఇంచార్జి కుమ్మరికుంట్ల సుధాకర్, పోలగాని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.