మిర్యాలగూడ సమగ్రాభివృద్దే ధ్యేయం
* వైకుంఠ ధామాన్ని ప్రారంభించిన భాస్కర్ రావు
ప్రజాలహరి…
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్దే తమ ధ్యేయమని శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ నుంచి మంజూరైన కోటి రూపాయల నిధుల ద్వారా బాపూజీనగర్ లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ తో కలిసి శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శనివారం ప్రారంభించారు. అనంతరం నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వసతుల ద్వారా నిర్మించిన వైకుంఠ ధామాల నిర్మాణాల ద్వారా కష్టాల కష్టాలు వైదొలగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు కొమ్మన నాగలక్ష్మి, ఉదయ్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సందేషి ఆంజనేయరాజు, బీఆర్ఎస్ నాయకులు పునాటి లక్ష్మీనారాయణ, ఐల వెంకన్న, భీమ్లా నాయక్, గొంగిడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార ప్రతినిధి పిన్నబోయిన శ్రీనివాస్‌యాదవ్, వార్డు అధ్యక్షులు ఆవుల చినమల్లయ్య, వినాయక రావు, దుర్గాచారి, మోహన్ రావు, ఉపేంద్ర, కోటిరెడ్డి, వేణు, పండగ క్రాంతి, నాగలక్ష్మి, మీసాల జగదీష్, మొండికత్తి లింగయ్య, కొత్త శ్రీను, పెరుమాళ్ళ ధనమ్మ, భాగ్యమ్మ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.