
ప్రజాలహరి మిర్యాలగూడ తెలంగాణ రాష్ట్ర BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మున్సిపల్ మరియు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారు ఈ నెల 10వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఎన్.ఎస్.పీ క్యాంపు మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా. ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు.