ఎడమ కాల్వ కి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే
వేములపల్లి( ప్రజాలహరి) నాగార్జునసాగర్ ఎడమ కాలువకు శుక్రవారం మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు నీటి విడుదల చేసినట్టుగా మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత రెండు మూడు మాసాల నుంచి వర్షాలు లేక భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగట్టుకుపోయాయి దీంతో ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయి ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు జిల్లా మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పంట పొలాల పరిస్థితిని వివరించారు దీంతో వారు వెంటనే స్పందించి రైతు సంక్షేమమే మన సంక్షేమంగా భావించి వెంటనే నీటిని విడుదల చేయమని కోరారు దీంతో ఆయన నీటిని విడుదల చేసినట్టుగా తెలిపారు. ఈ సమావేశంలో ఆయన వెంట మిర్యాలగూడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్ట మల్లేష్ గౌడ్, సీనియర్ టిఆర్ఎస్ నాయకులు మజ్జిగ సుధాకర్ రెడ్డి, కాట్రగడ్డ గోపాలరావు, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గౌడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు