
ప్రజాలహరి మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ జిల్లా కావాలని జిల్లా సాధన సమితి వారు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో యూత్ కాంగ్రెస్ అధ్వర్యంలో వారికి మద్దతుగా సామాజికవేత్త మున్సిపల్ ఫోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేసి మిర్యాలగూడ జిల్లా సాధించేవరకు కాంగ్రెస్ పార్టీ మరియు BLR బ్రదర్స్ ఎప్పుడు తమ సహకారం ఉంటుందని జిల్లా వచ్చేంతవరకు అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.*