మిర్యాలగూడ జిల్లా స్టిక్కర్ ఆవిష్కరణ:-
ద్విచక్ర వాహనాలపై మిర్యాలగూడ జిల్లా పేరుతో తయారుచేసిన స్టిక్కర్లను శుక్రవారం మిర్యాలగూడలో జిల్లా సాధన సమితి నాయకులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బిఎల్ఆర్ లు ఆవిష్కరించారు. మిర్యాలగూడ పట్టణానికి రిటైర్డ్ రెవిన్యూ అధికారి చెన్నూరి రంగారావు తయారు చేయించిన స్టిక్కర్లను అన్ని ద్విచక్ర వాహనాలపై అందించాలని అంటించుకోవాలని వారు సూచించారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి స్టిక్కర్లు ఒక సూచిక అని పేర్కొన్నారు. ప్రతి ద్విచక్ర,పెద్దవాహనాలపై మిర్యాలగూడ జిల్లా స్టిక్కర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయకులు డాక్టర్ రాజు దశరథ నాయక్ , దాసరాజు జయరాజు కోల సైదులు, జ్వాలా వెంకటేశ్వర్లు ,చెన్నురి రంగారావు, కాంగ్రెస్ నాయకులు పోదిల శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి తమ్మడ బోయిన అర్జున్, జానీ, బెజ్జం సాయి తదితరులు పాల్గొన్నారు.