*ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే*
మిర్యాలగూడ ప్రజాలహరి.
విద్యార్థుల సమగ్ర వికాసాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం (సీఎం బ్రేక్ ఫాస్ట్) ప్రాథమిక పాఠశాల షాబునగర్ తాళ్లగడ్డ నందు ప్రారంభించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు 119 నియోజకవర్గ కేంద్రాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క పాఠశాలను ఎంపిక చేసి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. గ్రామీణ, నిరుపేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలో ఉదయం సరిపడా ఆహారం లభించక అర్ధాకలితో విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారని విద్యార్థుల శారీరక పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చిరుధాన్యాలు(మిల్లెట్స్) అధిక పోషకాలు కలిగిన పదార్థాలతో రోజుకొక ఐటమ్ చొప్పున అల్పాహారం ప్రతిరోజు ఉదయం 8.30 గంటలకే తయారుచేసి అందించాలని కోరారు. డ్రాప్ అవుట్ నివారణకు, విద్యార్థుల హాజరు పెంచుటకు ఈ పథకం దోహాధ పడుతుందని తల్లిదండ్రులు క్రమం తప్పకుండా విద్యార్థులను పాఠశాలలకు పంపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనంలో వారానికి మూడుసార్లు కోడిగుడ్లు, మూడుసార్లు రాగి జావా అందించి విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యార్థుల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, RDO చెన్నయ్య, జిల్లా రైతుబంధు అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు నూకల సరళ హనుమంతరెడ్డి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, స్థానిక కౌన్సిలర్ బంటు రమేష్, కందగట్ల అశోక్, సర్పంచ్ రవీందర్ నాయక్, జిల్లా సివిల్ సప్లై అధికారి నాగేశ్వరరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారిని జ్యోతిలక్ష్మి, మండల విద్యాధికారి ఎం బాలాజీ నాయక్, సంజీవ్ రెడ్డి, షైక్ నాగుల్ బాబా, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు..
*మెనూ ఇదే*:-
సోమవారం-ఇడ్లీ సాంబార్ (or) గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ..
మంగళవారం – పూరీ, ఆలు కుర్మా (or) రవ్వ, చట్నీ టమాటో బాత్ ..
బుధవారం – ఉప్మా, సాంబార్ (or) కిచిడి, చట్నీ..
గురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ (or) పొంగల్, సాంబార్..
శుక్రవారం – ఉగ్గాని (or) పోహ (or) మిల్లెట్ ఇడ్లీ, చట్నీ (or) గోధుమ రవ్వ కిచిడి, చట్నీ..
శనివారం – పొంగల్, సాంబార్ (or) వెజిటబుల్ పలావ్, రైతా (or) ఆలు కుర్మా….