*కె. కేటీఆర్.ఆర్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, సభ స్థలంలను పరిశీలించిన ఎమ్మెల్యే*
ప్రజాలహరి మిర్యాలగూడ .
తెలంగాణ రాష్ట్ర బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & మున్సిపల్ మరియు ఐ.టి శాఖమాత్యులు శ్రీ కె.తారక రామారావు 10వ తేది మిర్యాలగూడ నియోజకవర్గం నందు పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి అనంతరం స్థానిక NSP క్యాంపు మైదానం నందు నిర్వహించు ప్రగతి నివేదన సభలో పాల్గొంటారు..ఈ నేపద్యంలో హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని, వైకుంఠ దామాన్ని, ప్రగతి నివేదనసభ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పరిశీలించారు……వారి వెంట మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ఆర్.డి.ఓ చెన్నయ్య, డి.ఎస్పి వెంకట గిరి, పట్టణ కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు…