జిల్లా ఏర్పాటు ఉద్యముంలో ఎమ్మేల్యే ఎందుకు భాగస్వామ్యం కావడంలేదు:- బిజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి..
ప్రజాలహరి మిర్యాలగూడ
జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ఎమ్మేల్యే భాస్కర్ రావు ఎందుకు భాగస్వామ్యం కావడంలేదో ప్రజలకు చెప్పాలని బిజేపి నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాలు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.జిల్లా సాధన సమితి అధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహారదీక్షలు బుధవారం నాలుగవ రోజుకు చేరుకోగా దీక్షలలో టిడిపి నాయకులు నాసిరోద్ది న్ బాబా,ప్రభాకర్, శ్రీనివాస్,అనంతరములు, మచ్చ సైదులు, వెంకన్న,నాగేందర్, కాశయ్య, సత్యం రమేష్ నాయక్,వెంకటేశ్వర్లు కూర్చోగానే బిజేపి నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీ వారు మిర్యాలగూడను జిల్లాగా చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు.అన్ని సౌకర్యాలు,వనరులు వున్న మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా చేయడం ఎమ్మేల్యే భాస్కర్ రావు ఇష్టం లేదని స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.జిల్లా కేంద్రం అయితే ప్రజల ఇబ్బందులు తొలగుతాయి , మిర్యాలగూడ సత్వరం అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు.జిల్లా ఏర్పాటు ఉద్యమానికి బిజేపి పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి జిల్లా ఏర్పడే వరకు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుందని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సరిత,బిజేపీ నాయకులు రతన్ సింగ్ నాయక్,దొండపాటి వెంకట్ రెడ్డి,రమేష్, పురుషోత్తం రెడ్డి, సీతారాం రెడ్డి, రామచంద్ర రెడ్డి,రామ్మూర్తి,విద్యసాగర్, శ్యామ్, శేఖర్,జిల్లా సాధన సమితి నాయకులు దాసరాజు జయరాజు,రాజు, జ్వాలా వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు.