నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే మెరుగైన ఉపాధి అవకాశాలు
* నిరుద్యోగ యువతకు ఆశాదీపం ఎన్బీఆర్ ఫౌండేషన్
* బహుళ జాతీయ కంపెనీల సాయంతో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న నల్లమోతు సిద్దార్థ కృషి నిత్య అభినందనీయం
* మిర్యాలగూడ లో మెగా జాబ్ మేళా ప్రారంభం : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ..
ప్రజాలహరి ,మిర్యాలగూడ.
నేటి పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే, మెరుగైన ఉపాధి అవకాశాలను పొందాలంటే యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రంగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో ఎన్బీఆర్ ఫౌండేషన్ నిర్వర్తిస్తున్న కృషి అద్వితీయమని, సత్ఫలితాలను ఇస్తున్నదని కొనియాడారు. నిరుద్యోగ యువతకు ఎన్బీఆర్ ఫౌండేషన్ ఆశాదీపంగా మారిందన్నారు. ఓ పక్క సేవా కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తూనే మరోపక్క మిర్యాలగూడ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉక్కు సంకల్పంతో ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. బహుళ జాతీయ కంపెనీల సాయంతో యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న నల్లమోతు సిద్దార్థ కృషి నిత్య అభినందనీయమని ప్రశంసించారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన ఎందరో ఔత్సాహిక అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి వారి జీవితాల్లో స్థిరపడ్డారని అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలో నందిపహాడ్‌లోని టీఎన్‌ఆర్ గార్డెన్స్ లో తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఎన్‌బీఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాను శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేరిట ఫౌండేషన్ ను స్థాపించి విస్తృత సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్న నల్లమోతు సిద్దార్థ యువతకు స్ఫూర్తి ప్రదాతగా మారారని అన్నారు. ఉద్యోగార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు శిక్షణ కోసం హైదరాబాద్ వంటి మహా నగరాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్లి వసతి కోసం, ఫీజుల రూపంలో వేలాది రూపాయలు ఖర్చు చేయకుండా ఫౌండేషన్ ద్వారా ప్రతి యేటా ఉత్తమ ఫ్యాకల్టీల సహకారంతో ఉచిత శిక్షణ, ఉచిత స్టడీ మెటీరియల్ అందజేస్తూ అలాగే ప్రతి యేటా జాబ్ మేళాలను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కలిపిస్తున్నట్టు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. కాగా,
నియోజకవర్గంలోని నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ధృడ సంకల్పంతో బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులను మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి రప్పించి జాబ్ మేళాలను నిర్వహిస్తున్నట్టు జాబ్ మేళాలో ఇంజినీరింగ్, ఐటీ, ఫార్మసి, బ్యాంకింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్షన్, టెలికాం, మార్కెటింగ్, హోటల్ మేనేజ్ మెంట్, ఫైనాన్స్, సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్స్ మొదలగు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారని నల్లమోతు సిద్దార్ధ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపెపీ నూకల సరళ హన్మంత్ రెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు అంగోతు హాతిరాం నాయక్, ధర్మపాల్ రెడ్డి, జొన్నలగడ్డ రంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు బాసాని గిరి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, చౌగాని బిక్షం గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పులి జగదీష్, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.