Ultimate magazine theme for WordPress.

కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు

Post top

ప్రజాలహరి ..

 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశం అయింది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

 

 

 

 

కేంద్ర కేబినెట్ కీలకనిర్ణయాలు ఇవే

 

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. 8 వేల కోట్ల ఉత్పత్తులు లక్ష్యంగా బోర్డు ఏర్పాటు

 

తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్రం తీర్మానం.

 

రూ. 889 కోట్లతో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యునివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్‌పీజీ సిలిండర్‌పై మరో రూ.100 సబ్సిడీ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటివల తగ్గించిన రూ.200 తో కలిపి మొత్తం ఇప్పుడు రూ. 300 మేర ఉపశమనం కల్పించిందని కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాగూర్, కిషన్ రెడ్డిలు తెలిపారు

post bottom

Leave A Reply

Your email address will not be published.