మిర్యాలగూడ ప్రజాలహరి….వారసత్వపు రాజకీయాలకు అంకురార్పణ చేసింది బిజెపి పార్టీ నేనని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడని..తెలంగాణ పై విషం కక్కుతున్నాడని ధ్వజమెత్తారు.తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రలేదని అన్నారు సిబిఐ,ఈడి సంస్థలు..బిజెపి పార్టీ జేబు సంస్థలని ఆరోపించారు.ఈ దేశంలో బిజెపి చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని ఇన్ని కావని విమర్శించారు. మీ పార్టీలో..మీ మంత్రివర్గంలో కుటుంబ పార్టీల నుంచి వచ్చిన వారు లేరా అని ప్రశ్నించారు.విద్యావంతుడు ,మంచి అడ్మినిస్ట్రేటివ్ కేటీఆర్ ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి రథసారధి అవుతాడన్నారు.కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ప్రధాని మోదీ సహకారం అవసరంలేదని.. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం, కేసీఆర్ ఉంటే చాలని తెలిపారు. తొమ్మిదిన్నరఏళ్లలోఅన్ని రంగాలలో అభివృద్ధితో తెలంగాణను మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్ దే అన్నారు.తెలంగాణ ఏర్పాటులో రక్తం ఏరులైపారింది అంటున్న మోడీ ఎక్కడ రక్తం ఏరులైందో చెప్పాలన్నారు. తన పక్కన అవినీతిపరులకు చోటు లేదంటున్న ప్రధాని మోదీ.. మీ పార్టీలోని కొందరు ముఖ్యమంత్రులు ఈడీ, సిబిఐ కేసుల్లో ఇరుక్కుని ఉన్నారని.. వారి సంగతి ఏంటో చెప్పాలన్నారు.నిన్న జరిగిన నిజామాబాద్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.