*కళ్యాణ లక్ష్మి & షాదిముబారక్ చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు . మిర్యాలగూడ ప్రజాలహరి…
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక పధకం కళ్యాణ లక్ష్మి & షాదిముబారక్ ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 424 మందికి (మిర్యాలగూడ పట్టణం మరియు మండల వ్యాప్తంగా- 201 మందికి, వేములపల్లి- 41 మందికి, మాడ్గులపల్లి- 57 మందికి, దామరచర్ల- 68 మందికి, అడవిదేవులపల్లి- 57 మందికి ) మంజూరైన మొత్తం 4 కోట్ల 24 లక్షల 49 వేల 184 రూపాయల విలువ గల చెక్కులను ఈరోజు మిర్యాలగూడ పట్టణము షాబు నగర్ లో గల ARC గార్డెన్స్ ఫంక్షన్ హల్ నందు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు లబ్దిదారులకు అందజేసారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి గారు, మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా డి.సి.యం.ఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం బుచ్చయ్య (సంపత్), మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కుందూరు వీరకోటి రెడ్డి, జడ్పిటిసి లలితా హతిరం నాయక్, ఇరుగు మంగమ్మ వెంకటయ్య, కుర్ర సేవ్యా నాయక్, ఎం.పి.పి నూకల సరళ హనుమంత్ రెడ్డి, నందిని రవితేజ, పోకల శ్రీ విద్య రాజు, ధనావత్ బాలాజీ నాయక్, పుట్టల సునీత, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మోసిన్ అలీ, వైస్ ఎంపిపి పాదురి గోవర్ధిని, అమరావతి సైదులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, PACS చైర్మన్లు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాలుట్ల బాబయ్య, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎం.పి.టి.సిలు, బి.ఆర్.ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….