తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ప్రధానమంత్రి కి ఏమి సంబంధం… కేటీఆర్..
ప్రజాలహరి జనరల్ డెస్క్.., తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటే తన శాసనసభ్యుల అనుమతించాలని ప్రధానమంత్రి మోడీ అనుమతి అవసరం లేదని తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానిమోడీకి శాసన వ్యవస్థ పై పార్లమెంటరీ వ్యవస్థ పై కనీసం అవగాహన లేదని ఘాటుగా విమర్శించారు. భాజాపేత్తర రాష్ట్రాలకు వెళ్లినప్పుడల్లా అక్కడ అధికారం లోఉన్న ముఖ్యమంత్రులపై అవినీతి మరక వేయడం మోడీకి అలవాటైందని చివరకు మోడీని మాటలను , ప్రసంగాలను ఎవరు కూడా నమ్మే పరిస్థితి కాని ,విశ్వసించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలో మోడీని భాజాపాను ఓడించి బుద్ధి చెప్తామన్నారు. మోడీ తో చేతులు కలపాల్సిన అవసరం తమకు లేదని మోడీ గ్రూపులో ఉంటేనే మంచి వాళ్ళమా లేకపోతే తమపై అబద్దాల ప్రచారం చేస్తారా ఇది రాజకీయంగా సరైంది కాదు అని కేటీఆర్ అన్నారు. మేము ప్రజలకు రైతులకు కావాల్సిన అభివృద్ధి పథకాలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణపై ప్రేమ నటిస్తూ విషం చిమ్మి మోడీ కుట్రలు, కుతంత్రాలు ఇక్కడ చెల్లవని పేర్కొన్నారు.