కదం తొక్కిన విద్యార్ధి లోకం..
ర్యాలీగా వచ్చి దీక్షలకు మద్దతు
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగంగా మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటుచేసిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారం మూడవ రోజుకు చేరుకుంది.దీక్షలను జిల్లా సాధన సమితి నాయకులు దాసరాజు జయరాజు, జోసెఫ్ ప్రారంభించారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి మద్దతు సంఘీభావం తెలుపాలని కోరారు.అన్ని అర్హతలు,అవకాశాలు వున్న మిర్యాలగూడను జిల్లా చేయాలని జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు
కదం తొక్కిన విద్యార్ధి లోకం:-
జిల్లా ఏర్పాటు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కేఎల్ఎన్ జూనియర్
కళాశాల విద్యార్థులు చెప్పారు.రిలే నిరాహార దీక్ష శిబిరానికి ర్యాలీగా వచ్చి మద్దతు తెలుపారు.ప్రజాభిప్రాయాన్ని గౌరవించి జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు.అనంతరము మిర్యాలగూడను జిల్లా చేయాలని నినాదాలు చేస్తూ సాగర్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు జోసెఫ్, సామజిక తెలంగాణ ప్రధాన కార్యదర్శి దాసరాజు జయరాజు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
రిలే నిరాహార దీక్షలో కూర్చున్న వారు:-
మూడవరోజు రిలే నిరాహార దీక్షలో యాదవ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్,బంటు కవిత, లైట్ మోటర్ వెహికల్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు గోప,రాంబాబు నాయక్, పట్టేటి వెంకన్న,వసీం, అజ్గార్అలీ,శ్రీనివాస్ రాజు, రసూల్,శ్రేయినిస్ కుమార్,తదితరులు కూర్చున్నారు.