ప్రజాలహరి …..మిర్యాలగూడ నియోజకవర్గంలోని అవంతిపురం దగ్గర మిషన్ భగీరద కార్మికులను తెలంగాణ ప్రభుత్వం నియమించిన ఆంధ్ర కంపెనీ GVPR యాజమాన్యం వారితో రేయనగా పగలనక వెట్టి చాకిరి చేయించుకుంటూ సుమారుగా ఐదు, ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వారిని మానసికంగా వేధిస్తూ ఆంధ్ర GVPR సంస్థ ఏఈలు ఇతర ఆంధ్ర ఉద్యోగులకు లక్షల జీతాలు తీసుకుంటూ తెలంగాణ బిడ్డలతో వెట్టి చాకిరి చేయిస్తున్నందున
స్థానిక అవంతిపురం మిషన్ భగీరథ ఆఫీస్ ముందు కోదాడ జడ్చర్ల జాతీయ రహదారి పైన మిషన్ భగీరథ కార్మికులతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నూకల వేణుగోపాల్ రెడ్డి మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ మాట్లాడుతూ గత 5 నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ లేక ఇబ్బందులు పడుతున్నారు. GVPR అనే ఆంధ్ర సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి ఆంధ్రవాదులకు లక్షల జీతాలు ఒకటో తారీకు వస్తాయి కానీ కార్మికులకు 9,000 వేల రూపాయలు ఇవ్వరా? మిషన్ భగీరద మొదలైన నాడు 15,000 వేల రూపాయలు జీతం ఇచ్చి మధ్యలో తక్కువ చేసినా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల కిందట జీతాలు రావట్లేదని కొందరు ఆత్మహత్య లు కూడా చేసుకున్నారు. రాత్రి వేళలో ట్యాంక్ ల దగ్గర అడవులలో పడుకొని కనీసం వారికీ జరగరానిది జరిగిన ప్రమాద భీమా కూడా లేదు వారికి బండ్లో పెట్రో లు కానీ కుటుంబ నిత్యావసరాలు గాని ఎలా భరిస్తారు? జీవో 60 నీ తక్షణమే అమలు చేయాలి. ఈ ప్రభుత్వం కమిషన్ లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు లు ఇచ్చి కార్మికుల పొట్ట కొడుతుంది. మిషన్ భగీరద స్థాపించినప్పుడు కూలి వాళ్ళు చేసే కంటే ఎక్కువగా గొడ్డు చాకిరీ చెప్పించుకొని వ్యవస్థను నిర్ములించుకొని ఈ రోజు కష్టాన్ని గుర్తించకపోవడం సిగ్గు చేటు. ఈ ధర్నాను పోలీస్ వారు వచ్చి అధికారులతో మాట్లాడి ధర్నా విరమపజేశారు మేము ఒక్కటే జీవీపీర్ సంస్థను మరియు ప్రభుత్వoని వెనువెంటనే జీతాలు ఇవ్వండి లేని యెడల పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ అధ్యక్షులు వేణు నాయక్, రవి, వెంకటేశ్వర్లు, ఎంపిటిసి ఫోరం అధ్యక్షుడు బెజ్జం సాయి గారు. నియోజకవర్గ యువజన ఉపాధ్యక్షుడు సిద్దు నాయక్ గారు. పొలాగని వెంకటేష్ గౌడ్,అబ్దుల్లా గారు. శరత్ గారు. విష్ణు గారు. ఇమ్రాన్ గారు. మస్తాన్ గారు. మహేష్, చందు నాయక్, అజయ్, శ్రీనివాస్ రెడ్డి మరియు బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు