కెసిఆర్ పాపాలను కడిగేస్తా ప్రధానమంత్రి మోడీ… ప్రజాలహరి హైదరాబాద్… తెలంగాణ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుందని ఒకసారి బిజెపికి అధికార ఇవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు .ఈరోజు నిజామాబాద్ జిల్లా ఇందూరులో జరిగిన ప్రజా గర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారo లొ కి వచ్చిన వెంటనే కేసీఆర్ చేసిన పాపాలను కడిగి వేస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను భారత రాష్ట్ర సమితి మింగేసిందని తండ్రి, కొడుకు, బిడ్డ ,అల్లుడు కోసమే రాష్ట్రంలో పాలన జరుగుతుందని విమర్శించారు. హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత కేసీఆర్ నన్ను ప్రత్యక్షంగా గాని కలవలేదని అందుకు కారణం ఆయన కు నా కళ్ళలో చూడాలంటే ధైర్యం లేక భయంతో పరారే అవుతున్నారని విమర్శించారు. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ ఎన్ డి ఏ లో చేరుతానని తన కొడుకుని ముఖ్యమంత్రి చేయమని అడిగాడని అందుకు నేను అంగీకరించలేదని ఇది రాజరిక వ్యవస్థ కాదు ప్రజాస్వామ్యం ఇటువంటి వాటికి నేను అంగీకరించనని చెప్పడంతో ఆనాటి నుంచి నన్ను కలవటం గాని , నా సభలకు గాని ఆయన హాజరు కావడం లేదని విమర్శించారు. తెలంగాణకు అనేక నిధులు ఇచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవటంలో కేసీఆర్ విఫలమయ్యాడని విమర్శించారు. మోడీగా తన నమ్మాలని రానున్న బిజెపి ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
నిజామాబాదులో తెలంగాణ పవర్ జనరేషన్ ప్రాబ్లం లేకుండా 800 మెగావాట్ల ntpc విద్యుత్ తయారి కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. వీటితో పాటుగా సిద్దిపేట రైలు మార్గాన్ని , క్రిటికల్ కేర్ సెంటర్లను ప్రారంభించారు . కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు