Ultimate magazine theme for WordPress.

నిరంతర విద్యుత్ అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

Post top
home side top

కరెంటు అందించి పంట పొలాలను కాపాడాలి :జూలకంటి

*రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా

మిర్యాలగూడ, ప్రజాలహరి…..

24 గంటలు కరెంటు ఇచ్చి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని రైతు సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సుమారు గంటపాటు ధర్నా నిర్వహించి డిఈ వెంకటేశ్వర్లు కు వినతిపత్రo సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ముఖ్యంగా మిర్యాలగూడ ప్రాంతంలో వేసుకున్నటువంటి మెట్ట, వరి పొలాలు మొత్తం కూడా ఇవాళ నీళ్లు అందక కరెంటు సప్లై సరిగా లేక ఎండిపోతున్నదన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలోనే సాగర్ నీళ్లు విడుదల చేస్తారని, కాబట్టి నీళ్లు వస్తాయని ఆశతో రైతులు వరి పొలాలు వేసుకున్నారన్నారు కానీ సాగర్ నీళ్లు మరి విడుదల కాకపోవటం వలన కరెంటు మీద ఆధారపడి పంటలను సాగు చేసుకుంటే కరెంట్ సరిగా రాక పోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. పంట పొట్ట దశలు ఉన్నదని కరెంట్ ఇచ్చి పొలాలను కాపాడలన్నారు. పగలు ఆరు గంటలు, రాత్రి 6 గంటలు ఇస్తున్నారని చెప్పిన రెండు మూడు గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు కరెంట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బోర్లు నీళ్లు పడక అనేక ఇబ్బందులు పడుతున్నామని కరెంట్ సక్రమంగా కరెంట్ అందించాలన్నారు. సబ్ స్టేషన్ ల వద్ద కరెంటు విషయంపై ప్రశ్నిస్తే కెపాసిటీ లేకపోవడం వల్ల కరెంటు మీరు సప్లై చేయలేకపోతున్నామని సమాధానం చెప్పుతున్నారన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు నేరుగా పరిశీలన జరిపి ఎండిపోతున్న పంటపొలాలను దృష్టిలో ఉంచుకొని కరెంట్ సరఫరా నిరంతరం చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటలు కరెంటు ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సాగర్ ప్రాజెక్టులో తక్కువ నీరు ఉన్నప్పటికీ గతంలో నీటిని విడుదల చేశారని, ఇప్పుడు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటి విడుదలతో చెరువులు కుంటలు నింపినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. కరెంట్ సరఫరా చేసి రైతులను కాపాడకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, వినోద్ నాయక్,చౌగాని సీతారాములు, సైదమ్మ, పాపా నాయక్, ఎర్ర నాయక్, కె. రమేష్, గోవింద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,పిల్లుట్ల సైదులు, కరిమున్నిసా బేగం, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.