భాస్కర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలి
* బీఆర్ఎస్ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలి
* మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తాం
* కాంగ్రెస్ కపట నాటకాలను ప్రజలు తిప్పిగొట్టాలి
* నల్లగొండ పర్యటనలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి మంజూరైన రూ.311.27 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వర్చువల్ గా ప్రారంభం : మంత్రి కేటీఆర్
మిర్యాలగూడ ప్రజాలహరి….అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. భాస్కర్ రావు గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులంతా సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాస్కర్ రావు హ్యాట్రిక్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తో కలిసి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం వర్చువల్ మోడ్ లో మంత్రి గంటకండ్ల జగదీష్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు లతో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గానికి తాజాగా మంజూరైన రూ.311.27 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. మిర్యాలగూడ నియోజకవర్గ ఓట్లరు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలు ఇంటింటికీ తిరుగుతూ కపట నాటకాలకు తెరలేపుతారని, వారి నాటకాలను ప్రజలు తిప్పిగొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల మేనిఫెస్టో లో వారిచ్చిన ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల హామీలు, తప్పుడు వాగ్దానాలను విశ్వసించి ప్రజలు తప్పుదోవ పట్టి ఆగం కావొద్దని కేటీఆర్ ఆకాంక్షించారు. మిర్యాలగూడ నియోజవర్గ అభివృద్ధి భాస్కర్ రావుతోనే సాధ్యమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, వార్డు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
#మిర్యాలగూడ నియోజకవర్గానికి తాజాగా మంజూరైన నిధులు రూ.311.27 కోట్లు- మంత్రి కేటీఆర్ వర్చువల్ పద్దతిలో ప్రారంభించిన పనులకు శ్రీకారం….
* టీయూఎఫ్ఐడిసీ నుంచి మంజూరైన రూ.5.50 కోట్ల నిధులతో హిందూ శ్మశాన వాటిక
* టీయూఎఫ్ఐడిసీ/ ఎంపీల్యాడ్స్ మంజూరైన రూ.9.80 కోట్ల నిధులతో కేసీఆర్ కళాభారతి/మినీ రవీంద్ర భారతి
* టీయూఎఫ్ఐడిసీ నుంచి మంజూరైన రూ.1.25 కోట్ల నిధులతో జ్యోతిరావు ఫూలే భవనం
* టీయూఎఫ్ఐడిసీ నుంచి మంజూరైన రూ.1.25 కోట్ల నిధులతో సంత్ సేవాలాల్ భవనం
* పంచాయత్ రాజ్ శాఖ నుంచి మంజూరైన కోటి రూపాయల నిధులతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవనం
* రాజీవ్ చౌక్ నుంచి నల్లగొండ వై జంక్షన్ నుంచి తడకమళ్ల రోడ్డు వరకు బీటీ రొడ్డు వరకు టీయూఎఫ్ఐడిసీ నుంచి మంజూరైన నిధులు రూ.21.00 కోట్లు
* అమృత్ 2.0/ మిషన్ భగీరథ నీటి సరఫరా….అమృత్ 2.0 ద్వారా మంజూరైన నిధులు రూ.173.07 కోట్లు
* అమృత్ 2.0/అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ….అమృత్ 2.0 ద్వారా మంజూరైన నిధులు రూ.93.40 కోట్లు
* ఎస్డిఎఫ్ ద్వారా మంజూరైన రూ.5కోట్ల నిధులతో లింక్ రోడ్ల ని ర్మాణం….