జిల్లా కోసం అర్ధనగ్నం..!
గాంధీ విగ్రహం ముందు నిరసన..!!
మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి సభ్యులు సోమవారం గాంధీ విగ్రహం ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం చొక్కాలు ఇప్పి నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణం స్పందించి అన్ని అర్హతలు వున్న మిర్యాలగూడను జిల్లాగా చేయాలని వారు కోరారు. జిల్లాగా ప్రకటించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చేగొండి మురళీ యాదవ్, దాసరాజు జయరాజు, అంజయ్య,ఉషా నాయక్,జోసెఫ్ తదితులున్నారు.